War 2: వార్ 2 ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్... ఆ డేట్ స్పెషాలిటీ ఏమిటంటే?
War 2 Trailer Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో రూపొందుతున్న సినిమా 'వార్ 2'. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోలుగా రూపొందుతున్న సినిమా 'వార్ 2' (War 2 Movie). ఆగస్టు 14న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఆ సంగతి ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
జూలై 25న 'వార్ 2' ట్రైలర్ విడుదల!
War 2 movie trailer release date: జూలై 25 వ తేదీన 'వార్ 2' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. ఆరోజున ట్రైలర్ విడుదల చేయాలని అనుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్... పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే, సౌత్ ఇండియాలోనూ ఫాన్స్ ఉన్న హీరో హృతిక్ రోషన్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ ఐకాన్స్. వీళ్ళిద్దరూ సినిమాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది (2025)తో పాతికేళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా జూలై 25న 'వార్ 2' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ తెలిపింది. అది సంగతి!
Also Read: పవన్ కళ్యాణ్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?
ANNOUNCEMENT🚨: #WAR2 trailer out on July 25th.#War2 is set to release in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse pic.twitter.com/PmWtPQSuTC
— Yash Raj Films (@yrf) July 22, 2025
ఆగస్టు 14న థియేటర్లలోకి సినిమా!
War 2 Release Date: హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలలోనూ ఆగస్టు 14న భారీ ఎత్తున 'వార్ 2' సినిమా విడుదల కానుంది ఇందులో కియరా అద్వానీ హీరోయిన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అందులో ఆవిడ బికినీ విజువల్స్ వైరల్ అయ్యాయి.
'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఆయన తీసిన 'బ్రహ్మాస్త్ర' తెలుగు రాష్ట్రాలలోనూ మంచి విజయం సాధించింది. 'త్రిబుల్ ఆర్' సినిమాతో నార్త్ ఇండియన్ ఆడియన్స్‌లో ఎన్టీఆర్ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'దేవర'తో ఉత్తరాదిలోనూ మంచి విజయం అందుకున్నారు. అందువల్ల, ఆయన తొలి హిందీ సినిమా 'వార్ 2' మీద అక్కడి ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్పై యూనివర్స్‌లో సినిమా కావడంతో మరింత క్రేజ్ నెలకొంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్ ఉంటారని హృతిక్ రోషన్ ఆయనకు మధ్య సన్నివేశాలు బాగుంటాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో 'వార్ 2' రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పారు.





















