Gangs of Godavari: ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ - కేక పుట్టిస్తున్న విశ్వక్ సేన్ పొలిటికల్ లుక్
మాస్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఊరమాస్ హీరో విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న చిత్రం ’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి బ్యాగ్రౌండ్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా గోదావరి యాస నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్తున్నారట.
ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్ పొలిటికల్ లుక్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. దసరా సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో విశ్వక్ సేన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్సులో జీప్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. చేతులు పైకి ఎత్తి అందరికి దండాలు పెడుతూ ఉండగా జీప్ కి ముందు ఎర్రజెండా కట్టి ఉంది. ఇక జెండాలో బోట్లను ఆపేందుకు ఉపయోగించే లంగరు బొమ్మను గుర్తుగా ముద్రించారు. దసరా శుభాకాంక్షలు చెప్తున్న నేపథ్యంలో జీప్ బ్యాక్ డ్రాప్ లో ఆయుధాలు పట్టుకొని దుర్గాదేవి ఫోటోను ఉంచారు. పోస్టర్ లుక్ ను బట్టి చూస్తే, సినిమాలో పొలిటికల్ టచ్ ఓరేంజిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#GangsofGodavari wishes you all a joyous and blessed Dussehra 🔱#HappyDussehra ✨ @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic
— VishwakSen (@VishwakSenActor) October 24, 2023
In… pic.twitter.com/gY6YzmB3Yo
వచ్చే నెల నుంచి ప్రచార కార్యక్రమాలు షురూ
ఇక సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో తెలుగమ్మాయి అంజలి కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాట అందరినీ ఆకట్టుకుంది. వ్యూస్ పరంగానూ అదరగొట్టింది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు పూర్తి డిఫరెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఉంటున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ కు ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ఇక విశ్వక్ సేన్ చివరిసారిగా 'దాస్ కా ధమ్కీ' సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా తనే వహించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంస్థలపై విశ్వక్ సేన్, కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 'హైపర్' ఆది, 'రంగస్థలం' మహేష్, రావు రమేశ్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల సంగీతం అందించారు.
Read Also: సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial