అన్వేషించండి

Gangs Of Godavari: వివాదాలకు విరామం, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Gangs Of Godavari Release Date: విశ్వక్ సేన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌పై ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు సాగాయి. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ ప్రకటించారు.

2023 డిసెంబర్‌లో విడుదల కావాల్సిన పలు సినిమాలు ఈ ఏడాది సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయ్యాయి. అలాగే డిసెంబర్‌లో ఎలాగైనా తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని మాటిచ్చిన విశ్వక్ సేన్.. పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్‌లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. ఈ పోస్టర్‌లో మూవీలో కీలక పాత్రలు పోషించిన నటులు అందరూ ఉన్నారు.

ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రమే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ పోస్టర్లు చూస్తుంటే.. ఇది గోదావరి జిల్లాల్లో తెరకెక్కే ఒక కమర్షియల్ సినిమా అని అర్థమవుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ప్రేక్షకుల ముందుకు రావడానికి లేట్ అయ్యింది. అంతే కాకుండా ఇప్పటికీ రిలీజ్ డేట్‌ను పలుమార్లు పోస్ట్‌పోన్ కూడా చేసుకోవాల్సింది ఈ చిత్రం. థియేటర్లలో ఎప్పటికప్పుడు తెలుగు సినిమాల మధ్య పోటీ నడుస్తుండడంతో ఆ పోటీ మధ్య ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. అందుకే ఫైనల్‌గా 2024 మార్చిలో దీని విడుదలను ఫైనల్ చేశారు.

నేహా శెట్టి గ్లామర్ అదుర్స్

2024 మార్చి 8న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో విశ్వక్ సేన్‌తో పాటు హైపర్ ఆది, గోపరాజు రమణ, ప్రవీణ్, మధు తదితర నటులు ఉన్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి నటించింది. మరొక కీలక పాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుంది. ఇప్పటికే విశ్వక్, నేహా కాంబినేషన్‌లో ‘సుట్టంలా చూసి’ అంటూ సాగే ప్రేమ పాట విడుదలయ్యి చార్ట్‌బస్టర్ అయ్యింది. ఇందులో నేహా శెట్టి గ్లామర్‌కు యూత్ మరోసారి ఫిదా అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కమర్షియల్ సినిమాలో విశ్వక్, నేహాల మధ్య మంచి ప్రేమకథ కూడా ఉండబోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

రిలీజ్ డేట్‌పై కాంట్రవర్సీ

చాలాకాలం తర్వాత యువన్ శంకర్ రాజా మళ్లీ తన మ్యూజిక్‌తో తెలుగు ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ అలరించడానికి సిద్ధమయ్యారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుండి విడుదలయిన ‘సుట్టంలా చూసి’ పాట మాత్రమే కాకుండా గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక తన ముందు సినిమాలతో పోలిస్తే.. విశ్వక్ సేన్.. ఈ మూవీలో కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. అచ్చ తెలుగు గోదావరి మాస్ కుర్రాడిలాగా విశ్వక్ మేక్ ఓవర్ బాగుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌పై పలు కాంట్రవర్సీలు కాగా.. ఫైనల్‌గా 2024 మార్చి 8న అయినా ఈ మూవీ విడుదల అవుతుందా లేదా అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘దేవర’ న్యూ ఇయర్ అప్‌డేట్ - జస్ట్ మారింది అదొక్కటే, ఊరించి మరీ షాకిచ్చారుగా!

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget