Gangs Of Godavari New Release Date: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - ఆ రోజే థియేటర్లో సందడి
Vishwak Sen Movie: ఎట్టకేలకు యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆయన నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.
Gangs Of Godavari Locks New Release Date: ఎట్టకేలకు యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆయన నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. షూటింగ్‌ను ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను రిలీజ్ కష్టాలు వెంటాడాయి. సరైన డేట్ దొరక్క ఈ మూవీ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్‌గా తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ ఈ సమ్మర్‌కి అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ గోదావరి సినిమాను మే 17న విడుదల చేయబోతున్నాం. ఈ సమ్మర్‌కు థియేటర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని కలుసుకోండి" అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
మూవీకి వరుసగా రిలీజ్ కష్టాలు
కాగా మొదట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిన మూవీని డిసెంబర్ 8న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిపై అధకారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ అప్పటిక షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా సెప్టెంబర్ వస్తుందనుకున్న సలార్ వాయిదా పడి డిసెంబర్ 22న వచ్చింది. అంతేకాదు అదే టైంలో నాని హాయ్ నాన్న సినిమా, నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' సినిమాలు రిలీజ్‌కు వచ్చాయి. దాంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా వేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పుడే రవితేజ 'ఈగల్' సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' వంటి సినిమాలు అప్పుడే ముందుకు రావడంతో మార్చి 8న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ అదే గోపిచంద్ 'భీమా', అదే హీరో విశ్వక్ సేన్ కొత్త గామిలు రిలీజ్‌కు ఉండటంతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మరోసారి వెనక్కి తగ్గింది. విశ్వక్‌దే మూవీ ఉండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు. దాంతో తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్‌ను ఫిక్స్ చేసుకున్న ఈ సమ్మర్‌కు సింగిల్‌గా రాబోతుంది.
Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! 🔥🌊
— Sithara Entertainments (@SitharaEnts) March 16, 2024
Mass ka Das @VishwakSenActor's #GangsofGodavari to release on 𝗠𝗮𝘆 𝟭𝟳𝘁𝗵 𝟮𝟬𝟮𝟰, worldwide.
Meet you in theatres this Summer #GOGOnMay17th 💥 pic.twitter.com/lOmdMLdOxy
కాగా ఈ యంగ్ హీరో సినిమా సినిమాకి మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటి వరకు 10 సినిమాల్లో నటించిన ఈ హీరో మెల్లి మెల్లిగా తన గ్రాఫ్‌ని పెంచుకుంటుపోతున్నాడు. పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికి వరకు తెలంగాణ స్లాంగ్‌తో అలరించిన ఈ హీరో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రంలో గోదారోళ్ల యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. పాటలు అయితే ఓ రేంజ్‌లో మారుమోగాయి. దాంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఈ మూవీ ఈ మాస్ హీరో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాయిదాల మీద వాయిదాల పడుతూ చివరికి ఈ మూవీ సమ్మర్‌లో వినోదం పంచేందుకు రెడీ అయ్యింది. మరి ఈ మూవీ ఆడియన్స్ ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.