Vishal: తనని గుర్తించట్లేదని బాధపడేది, ఆ విషయంలో సంతోషంగా ఉంది - వరలక్ష్మి పెళ్లిపై విశాల్ కామెంట్స్
Vishal: చాలాకాలం క్రితం విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. కానీ ఇన్నాళ్ల తర్వాత వరలక్ష్మి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఈ పెళ్లిపై విశాల్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
![Vishal: తనని గుర్తించట్లేదని బాధపడేది, ఆ విషయంలో సంతోషంగా ఉంది - వరలక్ష్మి పెళ్లిపై విశాల్ కామెంట్స్ Vishal comments on Varalaxmi Sarathkumar marriage and clarifies about his marriage plans Vishal: తనని గుర్తించట్లేదని బాధపడేది, ఆ విషయంలో సంతోషంగా ఉంది - వరలక్ష్మి పెళ్లిపై విశాల్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/c01310f846595aa1360c73b81ee6cf9d1713361060877802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vishal About Varalaxmi Sarathkumar Marriage: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో విశాల్ కూడా ఒకరు. అయితే ఇప్పటికే విశాల్‌కు హీరోయిన్‌తో పెళ్లి అంటూ పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే, విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ నటితో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లి వరకు వెళ్లలేదు. కానీ అంతకంటే ముందే వరలక్ష్మి శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్‌లో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ పెళ్లిపై, వారిద్దరి బాండింగ్‌పై ఈ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెయిట్ చేయాలి..
‘‘వరలక్ష్మికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. పెళ్లికంటే ఎక్కువగా తన కెరీర్ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత టాలెంట్ ఉన్నా ఎవరూ నన్ను గుర్తించట్లేదు అని వరు బాధపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్లలో ఆమె కోసం క్లాప్స్ కొడుతున్నారు. ఇదంతా చూసి తనకు మెసేజ్ చేశాను. చూశావా.. దేవుడు అవకాశాన్ని ప్రతీ ఒక్కరికీ ఇస్తారు, వెయిట్ చేయాలి అని చెప్పాను. లింగుసామి చేసిన ‘పందెం కోడి 2’ నుంచి తన కెరీర్ మారిపోయింది. కెరీర్ పరంగా తను అనుకున్నది సాధించినప్పుడు తనకు విషెస్ చెప్పాను. ప్రతీ అమ్మాయి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. ఆ విధంగా తను కూడా ఓ నిర్ణయం తీసుకుంది’’ అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు పెళ్లి, కెరీర్ విషయంలో కంగ్రాట్స్ చెప్పాడు విశాల్.
బాధ్యతలు ఉన్నాయి..
తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘పెళ్లి అనేది జరగాలి. కానీ ముందుగా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే తనను సంతోషంగా చూసుకోవాలి. ఆ అమ్మాయికి టైమ్ ఇవ్వాలి. నేను మామూలుగా 9 నుంచి 6 గంటల వరకు షూటింగ్ చేసి తర్వాత వచ్చి ఫ్యామిలీ లైఫ్ చూసుకునే వ్యక్తిని అయితే ఎప్పుడో పెళ్లి అయ్యిండేది. నాకు బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు తీసుకోకుండా నేను ఉండలేను, తీసుకుంటున్నాను. బాధ్యతలు తీసుకోకుండా నీ ఫ్యామిలీ, నువ్వు అని ఆలోచించే వ్యక్తిని కాదు. ఎప్పుడైతే నేను ఒక అమ్మాయికి టైమ్ ఇవ్వగలనో తప్పకుండా అప్పుడు పెళ్లి జరుగుతుంది. దేవుడు అనేవాడు అందరికీ ఒక దారి చూపిస్తాడు’’ అని విశాల్ చెప్పుకొచ్చాడు.
ఆ రూమర్స్ కొన్నిరోజులే..
వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్ మొదట్లో ‘మద గజ రాజా’ అనే సినిమాలో విశాల్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా తనకు తగిన గుర్తింపు రాలేదు. కానీ మరోసారి విశాల్ హీరోగా తెరకెక్కిన ‘పందెం కోడి 2’ విలన్‌గా కనిపించినప్పుడు వరలక్ష్మి కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. బ్యాక్ టు బ్యాక్ పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా తనకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలా మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారింది. తను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించిన చాలావరకు సినిమాలు హిట్ అవ్వడంతో ఇప్పుడు వరలక్ష్మి గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. ఇక విశాల్‌తో తన పెళ్లి అనే రూమర్స్ కూడా కొంతకాలం సినీ సర్కిల్లో చక్కర్లు కొట్టినా.. ఎవరి కెరీర్‌లో వారు బిజీ అవ్వడంతో ఆ రూమర్స్ కూడా ఆగిపోయాయి.
Also Read: నేను రవి కిషన్ కూతురిని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి - ‘రేసు గుర్రం’ విలన్‌పై ఆరోపణలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)