చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా? భారతీయ మహిళలకు చీర కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే, చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. చీర నడుము చుట్టూ చాలా గట్టిగా కట్టుకుంటారు. ఎక్కువ సేపు టైట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల నడుము దగ్గర చర్మం దెబ్బతింటుంది. చర్మం నల్లగా మారి క్యాన్సర్ వస్తుంది. దీన్ని స్క్వామన్ సెల్ కార్సినోమా అంటారు. భారత్ లో నమోదయ్యే క్యాన్సర్లలో చీర క్యాన్సర్ కేసులు 1 శాతంగా ఉన్నాయి. టైట్ గా ఉండే దుస్తులు గంటల తరబడి వేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.