Vikrant Massey: కావాలని అలా చెయ్యలేదు - హిందువులకు ‘12th ఫెయిల్’ హీరో క్షమాపణలు, అసలు ఏం జరిగింది?
Vikrant Massey: దాదాపు ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్.. ‘12త్ ఫెయిల్’ హీరోకు ఇప్పుడు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అందుకే దీనిపై వివరణ ఇవ్వడానికి విక్రాంత్ మాస్సే ముందుకొచ్చాడు.
Vikrant Massey Apologies To Hindus: సినీ సెలబ్రిటీలు కాస్త ఫేమ్ దక్కించుకున్న తర్వాత వారు మాట్లాడే మాటలు, చేసే పనులు, ప్రవర్తన అన్నింటిని ప్రేక్షకులు క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. అందుకే ప్రేక్షకుల మనోభావాలు, వారి నమ్మకాలు దెబ్బతీసే విధంగా ఏ సెలబ్రిటీ చేయరు. ఒకవేళ చేస్తే వారిపై వెంటనే విమర్శలు మొదలవుతాయి. తాజాగా ‘12th ఫెయిల్’ హీరో విక్రాంత్ మాస్సే పరిస్థితి కూడా అదే. 2018లో తను చేసిన ట్వీట్.. తాజాగా వైరల్‌గా మారింది. దీంతో ఆ ట్వీట్‌కు సంబంధించిన తను హిందువులకు క్షమాపణలు చెప్పక తప్పలేదు. తాజాగా ‘12th fail’ సక్సెస్‌తో ఫేమ్ దక్కించుకున్న విక్రమ్ మాస్సేకు ఆ పాత ట్వీట్ వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
విక్రాంత్ వివరణ..
2018లో విక్రాంత్ మాస్సే ఒక ట్వీట్ చేశాడు. అది రాముడు, సీతలకు సంబంధించిన ఒక కార్టూన్. ఆ కార్టూన్‌లో తప్పేమీ లేదు. కానీ అందులో సీతాదేవి రామభక్తుల గురించి వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా స్టేట్‌మెంట్ ఉంటుంది. ఈ ట్వీట్ చేసి ఆరేళ్లు అయినా ఇప్పుడు దీని గురించి విమర్శలు మొదలయ్యాయి. కొందరు ఇది కరెక్ట్ కాదని విమర్శించడం మొదలుపెట్టారు. దానిని షేర్ చేసినందుకు విక్రాంత్‌ను కూడా విమర్శిస్తున్నారు. దీంతో దీనిపై వివరణ ఇవ్వడానికి ఈ హీరో ముందుకు రాక తప్పలేదు. తాజాగా ఆ పాత ట్వీట్‌ను డిలీట్ చేసి.. దానిపై వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు విక్రాంత్.
నేను నేర్చుకున్నాను..
‘2018లో నేను చేసిన ట్వీట్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. హిందూ కమ్యూనిటీని హర్ట్ చేయాలని గానీ, దూషించాలని గానీ, కించపరచాలన్నది గానీ నా ఉద్దేశ్యం కాదు. అప్పట్లో నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని కాస్త మంచితీరులో చెప్పాల్సిందేమో. న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్‌ను చూపించడానికి కూడా ఆ విషయాన్ని చెప్పి ఉండవచ్చేమో. నేను పూర్తి వినయంతో దీని వల్ల హర్ట్ అయిన ప్రతీ ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నాను. నేను ప్రతీ నమ్మకాన్ని, మతాన్ని చాలా బలంగా నమ్ముతాను అని మీకు ఇప్పటికీ తెలిసుంటుంది. మనం సమయంతో పాటు ఎదుగుతూ తప్పుల నుండి నేర్చుకుంటాం. ఇది నేను నేర్చుకున్నది’ అంటూ స్పష్టంగా చెప్పుకొచ్చాడు విక్రాంత్ మాస్సే.
In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words:
— Vikrant Massey (@VikrantMassey) February 20, 2024
It was never my intention to hurt, malign or disrespect the Hindu community.
But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could…
ఎన్నో కష్టాలు ఎదుర్కొని..
ముందుగా టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విక్రాంత్ మాస్సే. కానీ సినిమాల్లోకి రావాలని కోరికతో టీవీకి దూరమయ్యాడు. దాని వల్ల అటు టీవీలోకి మళ్లీ వెళ్లలేక, ఇటు వెండితెరపై అవకాశాలు లేక చాలా కష్టాలు అనుభవించానని విక్రాంత్ తాజాగా బయటపెట్టాడు. ఇక బాలీవుడ్ నటి శీతల్ ఠాకూర్‌ను విక్రాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 12, 2022న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఓ బాబు ఉన్నాడు. ‘బాలికా వధు’, ‘ఖుబూల్ హై’ లాంటి హిట్ టీవీ షోలల నటించిన విక్రాంత్, 2013లో ‘లుటేరా’ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించిన తాజాగా తను హీరోగా వచ్చిన ‘12th fail’ తనకు బ్లాక్‌బస్టర్ హిట్‌ను తెచ్చిపెట్టింది.
Also Read: నెలకు రూ.35 లక్షలు - ఆ ఛాన్సు వదులుకొని అష్టకష్టాలు పడ్డా: ‘12Th ఫెయిల్’ హీరో ఆవేదన