అన్వేషించండి

Vikrant Massey: నెలకు రూ.35 లక్షలు - ఆ ఛాన్సు వదులుకొని అష్టకష్టాలు పడ్డా: ‘12Th ఫెయిల్’ హీరో ఆవేదన

‘12th ఫెయిల్’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విక్రాంత్ మాస్సే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించారు.

Actor vikrant massey about financial struggles: విక్రాంత్ మాస్సే తాజాగా చిత్రం ‘12th ఫెయిల్’ దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. హిందీలో గత ఏడాది అక్టోబర్‌ 27న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు మంచి హిట్‌ టాక్‌ లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లోనూ డబ్‌ చేసి నవంబర్‌ 3న రిలీజ్‌ చేశారు. సౌత్‌లోనూ ఈ మూవీకి ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. మొదట హిందీలో చిన్న సినిమాగా వచ్చినా, ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. కలెక్షన్లతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిన ఈ మూవీ మంచి మెసెజ్ ఒరియెంటెడ్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఓటీటీలోనూ ‘12th ఫెయిల్’ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా మనోజ్ కుమార్ IPS జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.  

కాలేజీ రోజుల్లో ఎన్నో అవమానాలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  విక్రాంత్ మాస్సే తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందుల గురించి వెల్లడించారు. కాలేజీ రోజుల్లోనే తోటి మిత్రుల నుంచి చులక భావాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. “నా కాలేజీ డేస్ లో మిత్రులు మా ఇంటికి వచ్చారు. మా అమ్మ వంట బాగా చేస్తుంది. వారికి మా అమ్మ చేతి వంట రుచిని చూపించాలి అని రమ్మన్నాను. వాళ్లు మా ఇల్లు చూసి నన్ను అదోలా చూశారు. ప్లాస్టిక్ కుర్చీలు, పాతబడిన పెయింటింగ్, లీకేజీలుగా ఉన్న ఇంటి సీలింగ్, సాధారణ వంటగదిని చూసి చులకన చేశారు. గంట సేపట్లోనే మా ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పుడు చాలా బాధ కలిగింది.  

టీవీ కెరీర్ ను వదులుకొని సినిమాల్లోకి!   

ఇక సినిమాల్లోకి రావాలనే కోరికతో చక్కటి టీవీ కెరీర్ ను వదులుకున్నట్లు చెప్పారు విక్రాంత్. “నేను టీవీ రంగాన్ని విడిచిపెట్టే సమయంలో బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాను. నెలకు రూ. 35 లక్షల కాంట్రాక్ట్ ఉండేది. టీవీ రంగంలో బాగా డబ్బు సంపాదించాను. 24 ఏళ్ల వయసులోనే మంచి ఇల్లు కొనుగోలు చేశాను. అమ్మానాన్న చేసిన అప్పులు కూడా తీర్చేశాను. ఆ సమయంలో నేను సినిమాల్లోకి వెళ్తాను అంటే మా పేరెంట్స్ షాక్ అయ్యారు. అయినా, వదిలేశాను. కానీ, ఆ తర్వాత అవకాశాలు రాక చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. ఆడియషన్స్ కోసం నా భార్య నుంచి డబ్బులు తీసుకుని వెళ్లేవాడిని” అని చెప్పుకొచ్చాడు.

శీతల్ ఠాకూర్ తో ప్రేమ వివాహం

ఇక బాలీవుడ్ నటి శీతల్ ఠాకూర్ ను విక్రాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 2022న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఓ బాబు ఉన్నాడు. ‘బాలికా వధు’,  ‘ఖుబూల్ హై’ లాంటి హిట్ టీవీ షోలల నటించిన విక్రాంత్, 2013లో ‘లుటేరా’ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. ఇటీవల ‘12th ఫెయిల్‌’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన భార్య సీతల్ ఠాకూర్ పంజాబీ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘బ్రిజ్‌ మోహన్ అమర్‌ రహే’ చిత్రం ద్వారా హిందీలోనూ ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్‌ సిరీస్‌లో విక్రాంత్‌తో కలిసి నటించింది. ఆ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

Read Also: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Common Used Passcodes: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget