Priyamani: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి
బాలీవుడ్ స్టార్, స్టార్ కిడ్స్ గురించి కీలక విషయాలు వెల్లడించింది సౌత్ స్టార్ నటి ప్రియమణి. జిమ్ ల ముందు, ఎయిర్ పోర్టులలో డబ్బులు ఇచ్చి మరీ ఫోటోలు తీయించుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Actress Priyamani On Bollywood Paparazzi Culture: సీనియర్ నటి ప్రియమణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా చక్కటి సినిమాల్లో నటించడంతో పాటు, సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళుతోంది. హీరోయిన్ గా కెరీర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది. వరుస హిట్లతో దుమ్మురేపుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియమణి, బాలీవుడ్ లోనూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించి ‘భామా కలాపం 2’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె పలువురు హిందీ హీరోయిన్లు, స్టార్స్ కిడ్స్ కు సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టింది.
డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు- ప్రియమణి
నిజానికి బాలీవుడ్ సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు వెంటపడుతూనే ఉంటాయి. జిమ్ సెంటర్ల నుంచి ఎయిర్ పోర్టుల వరకు వారి ఫోటోలను క్లిక్ మనిపిస్తారు. ఇలా సినీ సెలబ్రిటీలను వెంటబడి ఫోటోలు తీసే వారిని పపరాజీ అని పిలుస్తారు. అయితే, నిజంగానే బాలీవుడ్ సెలబ్రిటీలకు అంత క్రేజ్ ఉందా? జిమ్ ల ముందు, ఎయిర్ పోర్టుల ముందు ఎదురుచూసి ఫోటోలు తీసేంత ఖాళీగా మీడియా ప్రతినిధులు ఉన్నారా? అనే ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంది.
తాజాగా ప్రియమణి ఇదే విషయానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. “బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్ బయటికి రాగానే వారిని చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటారు. వారు ఎప్పుడెప్పుడు వస్తారా? ఫోటోలు తీద్దామని అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయితే, అదంతా జస్ట్ షో. బయటకు కనిపించేది ఒకటి. వాస్తవం మరొకటి. అలా ఫొటోలు తీసినందుకు సదరు సెలబ్రిటీలే కెమెరామెన్లకు డబ్బులు ఇస్తారు. బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా వచ్చేసింది.
సెలబ్రిటీలు వచ్చే సమయాన్ని ముందుగానే సోషల్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్లకు చెప్తారు. వాళ్లు వచ్చే సమయానికి రెడీగా ఉండి ఫోటోలు తీస్తారు. పని అయిపోగానే వారికి డబ్బులు ఇస్తారు. ‘జవాన్’ సినిమా చేసిన తర్వాత ముంబైకి వెళ్తే ఓ ఏజెన్సీ వ్యక్తి నాకు ఈ విషయం చెప్పాడు. ఈ పపరాజీ కల్చర్‌కు సంబంధించి ఎంత ఖర్చవుతుందనే దానిపై ఛార్జీల వివరాలు కూడా పంపించారు” అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
— Butcher (@karl__butcher) February 19, 2024
ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ‘భామా కలాపం 2‘
ఈ పపరాజీ కల్చర్ వ్యవహారంలో చాలా మంది పీఆర్ లు డబ్బులు నొక్కేస్తారని చెప్పుకొచ్చింది ప్రియమణి. సెలబ్రిటీల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని సోషల్ మీడియా కెమెరామెన్లకు తక్కువ మొత్తంలో అందిస్తారని చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రియమణి నటించిన చిత్రం ‘భామా కలాపం 2’. 2022లో వచ్చిన ‘భామా కలాపం’ సినిమాకు ఇది సీక్వెల్. అభిమన్యు తడిమేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 16 నుండి అందుబాటులోకి వచ్చింది. మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది.
Read Also: ఇవాళే బాయ్ ఫ్రెండ్‌తో రకుల్ వెడ్డింగ్ - రెండు సంప్రదాయాలో పెళ్లి, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు