Asuraguru Telugu Trailer: ‘అసురగురు’ ట్రైలర్ - నాలుగేళ్ల తర్వాత తెలుగులోకి వస్తున్న తమిళ మూవీ ఇది, మెప్పించేనా?
విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘అసురగురు‘. 2020లో విడుదలైన ఈ తమిళ యాక్షన్ మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Asuraguru Telugu Trailer Out: కోలీవుడ్ యాక్షన్ మూవీ ‘అసురగురు‘ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. అదే పేరుతో తెలుగులో విడుదల అవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. మే 3 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. దొంగతనం కథాంశంతో సాగే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
తమిళంలో డిజాస్టర్, మరి తెలుగులో?
2020 మార్చి 13న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అసురగురు‘. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు హీరోగా కనపించాడు. మహిమా నంబియార్ ఫీమేల్ లీడ్ గా నటించింది. ఈ సినిమాకు రాజ్ దీప్ దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి రావడం ఆసక్తి కలిగిస్తోంది. తమిళంలో ఫ్లాప్ అయిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీ విషయానికి వచ్చే సరికి మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాంటి సినిమాల లిస్టులో ‘అసురగురు‘ చేరుతుందేమో చూడాలి. మరో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది? అనే విషయం తేలిపోనుంది.
‘అసురగురు‘ కథ ఏంటంటే?
ఈ సినిమాను దొంగతనం కాన్సెప్ట్ తో రూపొందించారు రాజ్ దీప్. శక్తి(విక్రమ్ ప్రభు) ఓ టాలెంటెడ్ దొంగ. పోలీసులకు చిక్కుండా రిచ్ పీపుల్‌ను టార్గెట్ చేసి డబ్బు దోచుకుంటాడు. అతడిని పోలీసులకు పట్టించేందుకు దివ్య (మహిమా నంబియార్) ట్రై చేస్తుంది. అయితే, సాధారణ ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే శక్తి దొంగతనాలు చేస్తుంటాడు. ఈ విషయం దివ్యకు తెలుస్తుంది. చివరకు దివ్య, శక్తి కలుస్తారా? వారిని పోలీసులు పట్టుకుంటారా? అనేది కథ. ఈ సినిమాలో ట్విస్టులు, మలుపులు ఆకట్టుకుంటాయి. కానీ, ఈ మూవీ స్టోరీ చాలా సినిమాల్లో మాదిరిగానే ఉండటంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు యాక్టర్ సుబ్బరాజు పోలీస్ అధికారిగా ఇందులో నటించగా, యోగిబాబు తన కామెడీతో అలరించాడు.
సీనియర్ నటుడు ప్రభు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్రమ్ ప్రభు, జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు మహిమ తమిళంతో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తోంది. నటనా ప్రాధానత్య ఉన్న క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
View this post on Instagram
Read Also: ఐపీఎల్ మధ్యలో వచ్చిన ప్రభాస్ - 'కల్కి' టీజర్ ఇదేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!