అన్వేషించండి

Vijay Sethupathi: నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ తెలియదు - విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

Vijay Sethupathi: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘మహారాజా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Vijay Sethupathi About Pawan Kalyan: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి విజయం ఎప్పటికీ మరిచిపోలేమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం పవన్ కళ్యాణ్ గెలుపుపై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘మహారాజా’ అనే మూవీలో నటిస్తున్నారు విజయ్ సేతుపతి. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుండడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గెలుపుపై అభిప్రాయం వ్యక్తం చేశారు.

అదే చాలా ముఖ్యం..

‘‘పవర్ స్టార్‌కు నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను. ఆయన కష్టాన్ని నేను గౌరవిస్తాను. నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయనపై చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. ఆయన తొడకొట్టే వీడియో నేను చూశాను. పవన్ కళ్యాణ్ చాలా మాస్. ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. వేరేవాళ్ల కథలో ఆయన హీరో కాదు. ఆయన కథలో ఆయనే హీరో. మనిషికి అలాంటి మానసిక బలం చాలా ముఖ్యం. నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏమీ తెలియదు. కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు ఉన్నారు. వాళ్లంతా పవర్ స్టార్ వీడియోలను స్టేటస్ పెట్టారు’’ అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.

రియల్ లైఫ్‌లో కూడా మాస్..

‘‘పవన్ కళ్యాణ్ గురించి స్టేటస్‌లు చూసి అసలు ఏమైంది, ఏంటి అని వాళ్లను అడిగాను. నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్ కాదు, రియల్ లైఫ్‌లో కూడా అని అప్పుడే తెలిసింది. ఎవరైతే ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ ఎదుర్కొని మానసికంగా ధృడంగా ఉండడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతీరోజూ మన గురించి చాలా విమర్శలు వస్తుంటాయి. నేను అవి చూడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి అవన్నీ నాకు చూపిస్తూ ఉంటారు. చూడండి వాళ్లు మీ గురించి ఇలా అంటున్నారు అని పదేపదే చెప్తున్నప్పుడు కూడా మనం మానసికంగా ధృడంగా ఉండగలగాలి’’ అని తెలిపారు.

అన్నింటిని ఎదుర్కున్నారు..

‘‘పవన్ కళ్యాణ్ అన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఆయనంటో అందరికీ చూపించారు’’ అని పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారు విజయ్ సేతుపతి. ఇక పవన్ లాగానే తనను కూడా రాజకీయాల్లో చూసే అవకాశం ఉందా అని అడగగా.. ఆ ప్రశ్నను కట్ చేయమని నవ్వుతూ చెప్పారు. తమిళ రాజకీయాల్లో విజయ్ పాల్గొంటున్నారు కదా అని ప్రశ్నిస్తుండగా ఆ ప్రశ్నను ఆపేమయని అన్నారు విజయ్ సేతుపతి. ఇక విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ హీరో.

Also Read: ఎన్‌బీకే 109 గ్లింప్స్ వచ్చేసింది - అతడొక జాలి, దయాలేని అసురుడు.. బాలయ్య ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget