Vijay Sethupathi: ఆమెకు నో చెప్పే హక్కు ఉంది - యంగ్ హీరోయిన్లతో సీనియర్ హీరోలు జోడీపై విజయ్ సేతుపతి స్పందన
Vijay Sethupathi: విజయ్ సేతుపతి కెరీర్‌లో కచ్చితమైన రూల్స్ పెట్టుకొని వాటికి తగినట్టుగానే సినిమాలను సెలక్ట్ చేసుకుంటారు. తాజాగా సీనియర్ హీరోలు.. యంగ్ హీరోలతో జోడీకట్టడంపై ఆయన అభిప్రాయం తెలియజేశారు.
Vijay Sethupathi: మామూలుగా హీరోలకు కెరీర్ అనేది చాలా తక్కువకాలమే ఉంటుందని అంటుంటారు. అందుకే స్టార్‌డమ్ చూసిన తర్వాత కూడా చాలామంది హీరోయిన్లు ఏ ఆఫర్ వచ్చినా యాక్సెప్ట్ చేసేస్తుంటారు. అలాగే తమకంటే వయసులో చాలా పెద్దవారైన హీరోలతో కూడా నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రమే కాదు.. ఎప్పటినుండి అయినా సీనియర్ హీరోలు.. యంగ్ హీరోయిన్లతో నటించడం చాలా కామన్ అయిపోయింది. ఈ విషయంపై విజయ్ సేతుపతి పలుమార్లు స్పందించారు. అయినా ‘మహారాజా’ మూవీ ప్రమోషన్స్‌లో ఇదే విషయంపై ఆయనకు మరోసారి ప్రశ్న ఎదురయ్యింది. దీంతో ఆయన స్పందించక తప్పలేదు.
నేనే వద్దన్నాను..
సీనియర్ హీరోలు యంగ్ హీరోయిన్లతో నటించే విషయంపై విజయ్ సేతుపతి ఇప్పటికే పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ‘మహారాజా’ ప్రమోషన్స్‌లో కూడా మరోసారి అదే ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నేను ఇప్పటికే దాని గురించి మాట్లాడేశాను. 2021లో విడుదలయిన ‘ఉప్పెన’లో నేను కృతి శెట్టి తండ్రిగా నటించాను. ఆ తర్వాత ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి తనను మా సినిమాలో హీరోయిన్‌గా తీసుకుందామని అన్నారు. నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ‘ఉప్పెన’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నన్ను తన తండ్రిలాగా అనుకోమని కృతితో చెప్పాను’’ అని గుర్తుచేశారు విజయ్ సేతుపతి.
నో చెప్పవచ్చు..
హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా సీనియర్లతో నటించడానికి నో చెప్పే హక్కు ఉందని అన్నారు విజయ్ సేతుపతి. ‘‘కృతి శెట్టి కూడా ఆయన నన్ను తండ్రిలాగా అనుకోమన్నారు అందుకే ఆయన పక్కన హీరోయిన్‌గా యాక్ట్ చేయలేను అని చెప్పొచ్చు. అలా ఆమెకు కూడా నో చెప్పే హక్కు ఉంది. అయినా నేను ఈ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం ఇచ్చాను. ప్లీజ్ వదిలేయండి’’ అని ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు విజయ్ సేతుపతి. కోలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు సౌత్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ హీరో.
ల్యాండ్‌మార్క్ మూవీ..
విజయ్ సేతుపతి త్వరలోనే తన కెరీర్‌లోని 50 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అదే ‘మహారాజా’. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. జూన్ 14న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. నిథిలన్ సామినాథన్.. ‘మహారాజా’కు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి ఎక్కువగా విలన్ రోల్స్‌తో బిజీ అయిపోయారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తుండడంతో నేరుగా తమిళ సినిమా చేసి దాదాపు రెండేళ్లు అయ్యింది. అందుకే ‘మహారాజా’ కోసం తన తమిళ ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ హీరోకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్‌బేస్ ఉండడంతో ‘మహారాజా’ను తెలుగు ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం ఇక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తోంది మూవీ టీమ్.