Ace Movie Trailer: 'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది' - ఆసక్తికరంగా విజయ్ సేతుపతి 'ఏస్' తెలుగు ట్రైలర్
Vijay Sethupathi: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'ఏస్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది. అర్ముగ కుమార్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా.. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay Sethupathi's Ace Movie Trailer Released: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'ఏస్'. రొమాంటిక్ క్రైమ్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
బోల్ట్ కాశీ.. యంగ్ లుక్‌లో..
ఈ మూవీలో విజయ్ సేతుపతి గ్యాంబ్లర్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. క్రైమ్, కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బోల్ట్ కాశీ' అనే డిఫరెంట్ రోల్‌లో యంగ్ లుక్‌తో విజయ్ సేతుపతి అదరగొట్టారు. 'నా కళ్ల ముందు ఏమైనా అన్యాయం జరిగితే నేను ధైర్యంగా బోల్ట్‌గా ఎదిరిస్తాను.' అంటూ చెప్పే డైలాగ్ వేరే లెవల్. 'డార్క్ వెబ్'లో జరిగే గ్యాంబ్లింగ్ క్రైమ్ ప్రధానాంశంగా మూవీ రూపొందినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి, యోగిబాబు కామెడీ నవ్వులు పూయిస్తోంది. యాక్షన్, కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ఈ నెల 23న రిలీజ్
ఈ నెల 23న తెలుగు, తమిళ భాషల్లో 'ఏస్' మూవీ రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి సరసన 'సప్తసాగరాలు దాటి' రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. అరుముగ కుమార్ దర్శకత్వం వహించడం సహా నిర్మాతగానూ వ్యవహరించారు. 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మించగా.. తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. ఒకే రోజు రెండు భాషల్లోనూ థియేటర్లలో మూవీ సందడి చేయనుంది.
Time to witness the GALATTA MAXX trailer of #ACE now in Telugu!❤️🔥
— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2025
Aanandinchandi Peeps!
▶️ https://t.co/SMN0PFUdrG#ACETrailer #ACEFromMay23@VijaySethuOffl @rukminitweets @7CsPvtPte @Aaru_Dir @iYogiBabu @justin_tunes @samcsmusic @shreyaghosal @KapilKapilan_#KaranBRawat pic.twitter.com/2irkGuZGbx






















