Karaali Movie: కొత్త సినిమా స్టార్ట్ చేసిన నవీన్ చంద్ర... టైటిల్ పోస్టర్ చూశారా? డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు
Naveen Chandra New Movie: నవీన్ చంద్ర హీరోగా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ పతాకం నిర్మిస్తున్న 'కరాలి' సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయ్యింది.

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్లలో నవీన్ చంద్ర (Naveen Chandra) ఒకరు. ఒక వైపు భారీ సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ... మరోవైపు సోలో హీరోగా డిఫరెంట్ సబ్జెక్టులు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా కొత్త సినిమా పూజతో ఘనంగా ప్రారంభమైంది.
నవీన్ చంద్ర హీరోగా 'కరాలి'
నవీన్ చంద్ర హీరోగా శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ పతాకంపై మందళపు శివకృష్ణ నిర్మిస్తున్న సినిమా 'కరాలి'. ఇందులో రాశీ సింగ్, కాజల్ చౌదరి (kajal choudhary) హీరోయిన్లు. రాకేష్ పొట్టా దర్శకుడు. ఆదివారం పూజతో ఈ సినిమా ఘనంగా మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సాహూ గారపాటి ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ ఇవ్వడంతో పాటు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు. శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి సంయుక్తంగా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Also Read: రవితేజ 'మాస్ జాతర'లో విలన్ రోల్ తెచ్చిన ఎన్టీఆర్ సినిమా... హీరో నవీన్ చంద్ర లేటెస్ట్ ఇంటర్వ్యూ
పూజ తర్వాత హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ... ''ఈ టైటిల్ 'కరాలి' ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో... సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేయనటువంటి డిఫరెంట్ యాక్షన్ డ్రామా ఇది. కొత్త దర్శకులు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న నిర్మాతలు ముందుకు రావాలి'' అని అన్నారు. నిర్మాత మందలపు శివకృష్ణ మాట్లాడుతూ... ''కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని సినిమాల మీద ప్రేమతో ఇప్పటి వరకు దాచుకున్న డబ్బులతో ఇక్కడకు వచ్చా. రాకేష్ పొట్ట చెప్పిన కథ నచ్చడంతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. డిఫరెంట్ న్యూ టైప్ యాక్షన్ మూవీ చేస్తున్నాం. నేను కొత్త నిర్మాత అయినా అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి థాంక్స్'' అని అన్నారు. కథ నచ్చి అవకాశం ఇచ్చిన హీరో నవీన్ చంద్ర, నిర్మాత శివ ప్రసాద్ గారికి థాంక్స్ అని దర్శకుడు రాకేష్ తెలిపారు. హీరోయిన్ కాజల్ చౌదరి, కెమెరామెన్ అపూర్వ అనిల్ శాలిగ్రామ్, నటుడు రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?
Karaali Movie Cast And Crew: నవీన్ చంద్ర హీరోగా, కాజల్ చౌదరి & రాశి సింగ్ హీరోయిన్లుగా గరుడ రాముడు, రాజా రవీంద్ర , వెంకటేష్ ముమ్మిడి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కళా దర్శకురాలు: సుప్రియ బట్టెపాటి, కూర్పు: మాధవ్ కుమార్ గుళ్లపల్లి, ఛాయాగ్రహణం: అపూర్వ అనిల్ శాలిగ్రామ్, సంగీతం: వికాస్ బడిసా, నిర్మాణ సంస్థ: విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్, నిర్మాత: మందళపు శివకృష్ణ, దర్శకుడు: రాకేష్ పొట్టా.





















