అన్వేషించండి

Vijay: పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయిన విజయ్ - త్వరలో పార్టీ రిజిస్ట్రేషన్?

Vijay Political Entry: తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇన్నాళ్లకు పార్టీని రిజిస్టర్ చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Vijay Political Party: కొన్నేళ్లుగా తమిళంలో పలువురు స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ ఎన్నికల ముందు ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూస్తూ.. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. ఆ హీరో మరెవరో కాదు.. దళపతి విజయ్. ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందని కోలీవుడ్‌లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

రంగం సిద్ధం..

విజయ్.. తన పొలిటికల్ పార్టీని రెజిస్టర్ చేయడానికి రంగం సిద్ధమయ్యింది. హీరో ఫ్యాన్ క్లబ్ అయిన విజయ్ మక్కల ఇయక్కమ్ కూడా దీనికి సమ్మతించిందని సమాచారం. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ పరిణామం జరగడంతో విజయ్.. కచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ గురించి గురువారం మీటింగ్ జరిగింది. తన సొంత పార్టీని న్యాయబద్ధంగా రెజిస్టర్ చేయడానికి హీరో ఓకే అని చెప్పాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నెలరోజుల్లోనే పార్టీని స్థాపించి, దీనిపై విజయ్ ఒక క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. తమిళనాడు, కేరళలో హీరోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న విజయ్.. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు.

రిజిస్ట్రేషన్ మాత్రం ముందే..

సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయం నుండి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. 2018లో తుత్తుకుడీ పోలీస్ ఫైరింగ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి విజయ్ వెళ్లినప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఇక అప్పటినుండి ఈ హీరోకు చెందిన ఫ్యాన్ క్లబ్ ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పొలిటికల్ యాక్టివిటీలలో యాక్టివ్ అయ్యింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా పాల్గొంది. డిసెంబర్‌లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా విజయ్.. స్వయంగా వెళ్లి కుటుంబాలను కలిశాడు. అంతే కాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. 2026లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విజయ్.. పలుమార్లు హింట్లు ఇచ్చాడు కానీ పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం ముందే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట.

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’తో బిజీ..

ఒకవైపు విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నా.. సినిమాల విషయంలో మాత్రం తను యాక్టివ్‌గానే ఉంటున్నాడు. గతేడాది ‘వారిసు’, ‘లియో’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ‘వారిసు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ‘లియో’ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో విజయ్.. డబుల్ రోల్‌లో కనిపించనున్నాడు. చాలాకాలం తర్వాత విజయ్.. డబుల్ రోల్ చేస్తుండడంతో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. 

Also Read: ఓటీటీ డీల్‌ను లాక్ చేసుకున్న ‘కెప్టెన్ మిల్లర్’ - ఎవరు కొనుగోలు చేశారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget