Rowdy Janardhana: హైదరాబాద్‌లో పూజ... ముంబైలో రెగ్యులర్ షూట్... రౌడీ జనార్దన్ ప్లాన్ రెడీ!
Vijay Deverakonda's Rowdy Janardhan Update: 'రౌడీ జనార్ధన్' కోసం విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నారు. త్వరలో సినిమాకు పూజ చేసి, రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేశారు.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు రీసెంట్‌గా రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఆ సంగతి అధికారికంగా బయటకు చెప్పలేదు. ఇటీవల తాను చదివిన పుట్టపర్తి పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను కలిసి వచ్చారు. ఆ విషయం కంటే రిటర్న్ జర్నీలో కారుకు యాక్సిడెంట్ కావడం వైరల్ అయింది. విజయ్ దేవరకొండ పర్సనల్ విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి మరి, సినిమా సంగతి ఏంటి? అంటే...
రౌడీ జనార్ధన్ రెడీ... ప్లాన్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు 'ది ఫ్యామిలీ స్టార్' ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'రాజా వారు రాణి గారు'తో దర్శకుడిగా పరిచయం అయిన రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నారు. ఇందులో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ విలన్ రోల్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా త్వరలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 11... అంటే వచ్చే శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజ జరిగిన తర్వాత మూడు నాలుగు రోజుల విశ్రాంతి తీసుకుని అక్టోబర్ 16వ తేదీ నుంచి ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.
View this post on Instagram
విజయ్ జంటగా కీర్తి సురేష్!
'రౌడీ జనార్ధన్' సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా 'మహానటి' కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన సమాచారం. పెళ్లికి ముందు తర్వాత తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ వరుసగా సినిమాలకు సంతకం చేస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన వందో సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్ అని టాక్.
Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!
View this post on Instagram
రవికిరణ్ కోలా సినిమా కాకుండా తనతో 'టాక్సీవాలా' తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరొక సినిమా చేస్తున్నారు ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు. బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ సబ్జక్ట్స్‌తో కూడిన సినిమాలు యాక్సెప్ట్ చేశారు విజయ్ దేవరకొండ.





















