Ustaad Bhagat Singh Villain: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!
Pawan Kalyan's UBS Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన అభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. అందులో విలన్ రోల్ రిజక్ట్ చేశానని పాపులర్ పొలిటీషియన్ పేర్కొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు 'ఓజీ' మాంచి హై ఇచ్చింది. తామంతా తమ అభిమాన కథానాయకుడిని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నామో ఆ విధంగా దర్శకుడు సుజిత్ చూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే సినిమా బావుంటుందని పేరొచ్చింది. 'ఓజీ' గ్యాంగ్‌స్టర్ డ్రామా అయితే... దీని తర్వాత పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవన్ కళ్యాణ్. దానికి మరో ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ డైరెక్టర్.
హరీష్ శంకర్ మార్క్ సినిమా...
విలన్ రోల్ రిజక్ట్ చేసిన మల్లారెడ్డి!
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అందుకు కారణం పాపులర్ పొలిటీషియన్, విద్యా సంస్థల అధినేత మల్లా రెడ్డి (Malla Reddy).
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్‌కు దీటైన విలన్ రోల్ చేయమని తనను దర్శకుడు హరీష్ శంకర్ సంప్రదించినట్లు తాజా ఇంటర్వ్యూలో మల్లా రెడ్డి వివరించారు. మూడు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసిన సరే తాను చేయనని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ రిజక్ట్ చేయడానికి రీసన్ కూడా వివరించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ... ''ఇంటర్వెల్ వరకు నేను హీరోను తిడుతూ ఉంటా. ఇంటర్వెల్ తర్వాత నుంచి హీరో నన్ను తిడతాడు. కొడతాడు'' అని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన 'నో' చెప్పారట. దాంతో దళపతి విజయ్ 'తెరి' సినిమాలో మహేంద్రన్ పోషించిన విలన్ రోల్ గుర్తుకు వస్తోంది ప్రేక్షకులకు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చెయ్యమని 3 గంటలు వెయిట్ చేసి 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అయినా కూడా ఒప్పుకోలే - మల్లా రెడ్డి pic.twitter.com/mOiMQng3v2
— Vennela Kishore Reddy (@Kishoreddyk) October 7, 2025
దళపతి విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన తమిళ హిట్ సినిమా 'తెరి' స్ఫూర్తితో, ఆ కథకు తనదైన మార్పులు - చేర్పులతో హరీష్ శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అందులో విలన్ రోల్ మాత్రం అలాగే ఉంచినట్లు అర్థం అవుతోంది. క్యారెక్టర్ ఏదైనా హరీష్ శంకర్ రాసే డైలాగులు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దాంతో సీన్స్, రోల్స్ కొత్తగా కనిపిస్తాయి.
పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద రవిశంకర్ ఎలమంచిలి, నవీన్ ఎర్నేని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.
Also Read: లిటిల్ హార్ట్స్ తండ్రి... 90s కూతురు... Zee5లో కనబడుటలేదు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?





















