News
News
వీడియోలు ఆటలు
X

Vijay Devarakonda's Kushi First Song : విజయ్ దేవరకొండ రోజా సమంతే - 'ఖుషి'లో తొలి పాట విడుదల ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఇందులో తొలి పాట 'నా రోజా నువ్వే...'ను ఎప్పుడు విడుదల చేసేదీ నేడు వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా చిత్రం 'ఖుషి' (Kushi Movie). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...

నా రోజా నువ్వే...విడుదల ఎప్పుడంటే?
ప్రేమకథగా ఖుషి రూపొందుతోంది. ఇందులోని ఓ ప్రేమ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. 'నా రోజా నువ్వే...' అంటూ సాగే ఆ గీతాన్ని మే 9న ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ రోజు తెలిపారు. 

పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి'ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. పాటను కూడా ఈ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.  

సరిగమ చేతికి 'ఖుషి' ఆడియో రైట్స్!
'ఖుషి'కి హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో ఆయనకు మంచి పేరు ఉంది. సూపర్ హిట్ 'హృదయం' పాటలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. 'ఖుషి'కి ఆయన సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి... క్రేజ్ నెలకొంది. దానికి తోడు 'ఖుషి' టైటిల్, విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తోడు కావడంతో ఇంకా ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఫ్యాన్సీ రేటుకు సినిమా ఆడియో రైట్స్ సరిగమ కంపెనీ సొంతం చేసుకుంది.

Also Read : మహి ప్లాన్ ఏంటి - వైఎస్ జగన్ పాత్రలో ఆర్బీ చౌదరి తనయుడు జీవా!?

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

'ఖుషి'లో ఐటీ ఉద్యోగిగా సమంత!?
Samantha Role In Kushi : సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది.

'ఏ మాయ చేసావె'లో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట! అందులోనూ సినిమాలోని కొత్త స్టిల్ చూస్తే... 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. అందులో చీర అయితే, 'ఖుషి'లో చుడిదార్! అదీ సంగతి! ఆ మధ్య హైదరాబాద్, దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీలలో విజయ్ దేవరకొండ, సమంత మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.

Also Read కోలుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది - శరత్ బాబు లేటెస్ట్ హెల్త్ అప్డేట్

'ఖుషి' చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.  

Published at : 04 May 2023 04:18 PM (IST) Tags: Vijay Devarakonda Shiva Nirvana Hesham Abdul Wahab Samantha Kushi Movie Songs Na Rojaa Nuvve Song

సంబంధిత కథనాలు

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్,  ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు