News
News
X

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

తనను సూపర్ స్టార్ అంటుంటే ఇబ్బందిగా ఫీలవుతానని విజయ్ దేవరకొండ తెలిపారు. 'లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

FOLLOW US: 

ఇప్పుడు యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయకులలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఆయన్ను చాలా మంది సూపర్ స్టార్‌గా చూస్తున్నారు. అయితే... తనను సూపర్ స్టార్ అంటుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతానని విజయ్ దేవరకొండ అంటున్నారు. ఆగస్టు 25న 'లైగర్' (Liger Movie) విడుదల సందర్భంగా పలు నగరాలలో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరంగల్‌లో వేడుక నిర్వహించారు. అందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'లైగర్' సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''ఇండియా సగం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఏ ఊరిలో ఉన్నా మనవాళ్ళ గురించే ఆలోచన. తెలుగు ప్రేక్షకుల్ని మస్తు మిస్ అయ్యా. నేను ఏ ఊరికి వెళ్లినా విపరీతమైన జనాలు వచ్చారు. చాలా ప్రేమ చూపించారు. ఎందుకు అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. బహుశా... తెలుగు ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన ప్రేమ, ఇండియా అంతటా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ నేను మరువను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా'' అని అన్నారు.

ఆగస్టు 25న ప్రేక్షకులకు ఆ ప్రేమను తిరిగి ఇస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు. 'లైగర్' సినిమా బ్లాక్ బస్టర్ అని, సినిమా మీద ఎలాంటి డౌట్స్ లేవని ఆయన అన్నారు. తానూ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ... ప్రేక్షకులు థియేటర్లను షేక్ చేయాలని పిలుపు ఇచ్చారు.

''లైగర్' సినిమాలో తల్లీకొడుకులు కరీంనగర్ నుంచి ముంబై వెళతారు. ఇండియా షేక్ చేద్దామని! కొడుకును ఛాంపియన్ చేయాలని తల్లి తపన పడుతుంది. మా లైఫ్ కూడా అంతే! నేను కూడా ఇక్కడ చిన్న పిల్లాడినే. రోజూ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అని పిలిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పేరుకు నేను తగినంత చేయలేదు. ఇంకా చాలా చేయాలి. సినిమాలో హీరోలా నేనూ హైదరాబాద్ నుంచి ముంబై బయలు దేరాను. పూరి మా నాన్నలాగా... ఛార్మి మా అమ్మలా... ముగ్గురం బయలుదేరాం. ఇండియా షేక్ చేద్దామని ముంబై వెళ్లాం. ఏ ఇబ్బంది వచ్చినా కొట్టాలని ఫిక్స్ అయ్యాం. పూరి గారు రాసిన డైలాగులు చెప్పాలంటే దేవుడి ఆశీర్వాదం ఉండాలి. నేను ఈ సినిమాలో పూరి గారి డైలాగులు చెప్పగలిగా'' అని విజయ్ దేవరకొండ అన్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson), ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. 

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.

Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!

Published at : 15 Aug 2022 09:35 AM (IST) Tags: Vijay Devarakonda Puri Jagannadh Charmi Kaur Liger Movie Vijay Devarakonda On Super Star Tag Vijay Devarakonda Sensational Comments

సంబంధిత కథనాలు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

TSPSC: ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు , పరీక్ష తేది ఇదే!

TSPSC: ఒకట్రెండు రోజుల్లో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు , పరీక్ష తేది ఇదే!