Vijay Devarakonda: వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Opens Up About His Personal Life For The First Time : ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో ఓపెన్ అయినట్టు ముంబై టాక్.
సెలబ్రిటీల చేత వ్యక్తిగత విషయాలు మాట్లాడించడంలో కరణ్ జోహార్ స్పెషలిస్ట్. అందులోనూ 'కాఫీ విత్ కరణ్' కంటే స్టార్స్ పర్సనల్, సెక్సువల్ టాపిక్స్ అడ్డాగా మారింది. లేటెస్ట్ సీజన్‌లో సమంత, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక, విజయ్ దేవరకొండ అయితే ప్రోమోతో సంచలనం సృష్టించారు.
విజయ్ దేవరకొండ, ఆయనకు జంటగా 'లైగర్'లో నటించిన అనన్యా పాండే 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో సందడి చేశారు. వీళ్ళిద్దరూ హాజరైన ఎపిసోడ్ గురువారం (జూలై 28) సాయంత్రం ఏడు గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో ముగ్గురితో శృంగారం చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విజయ్ దేవరకొండ చెప్పిన విషయం వైరల్ అయ్యింది. శృంగారం గురించే కాదు, పెళ్లి గురించి కూడా ఆయన ఓపెన్ అయినట్టు తెలిసింది.
Vijay Devarakonda On Marriage : ''నేను పెళ్లి చేసుకునేటప్పుడు, తండ్రి అయ్యేటప్పుడు అందరికీ చెబుతా. గట్టిగా అరిచి మరీ చెబుతా. అప్పటి వరకూ నన్ను ఆరాధించే ప్రేక్షకుల మనోభావాలు గాయపరచాలని అనుకోవడం లేదు. నటుడిగా నన్ను చాలా మంది ప్రేమిస్తారు. నా ఫోటో వాళ్ళ గోడలపై ఉంటుంది. ఫోన్ వాల్ పేపర్స్ లో ఉంటుంది. వాళ్ళందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయాలని అనుకోవడం లేదు'' అని 'కాఫీ విత్ కరణ్'లో విజయ్ దేవరకొండ చెప్పారట.
Also Read : రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రెడీ!
విజయ్ దేవరకొండకు, ఆయనతో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో నటించిన రష్మికకు మధ్య ప్రేమ చిగురించిందని... వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు పుకార్లు వినిపించాయి. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని గతంలో రష్మిక చెప్పారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చెప్పినట్టు టాక్.
Also Read : 'F3'లో ఓవర్ యాక్షన్ చేశారు, 'అంటే సుందరానికీ' సాగదీశారు - తమ్మారెడ్డి కామెంట్స్
View this post on Instagram