అన్వేషించండి
Advertisement
Vignesh Shivan Nayanthara Wedding: కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్ళికి నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్ళికి లింక్ ఏంటంటే?
కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లికి, నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్ళికీ ఒక కనెక్షన్ ఉంది. అదేంటో తెలుసా?
హిందీలో అగ్ర కథానాయిక కత్రీనా కైఫ్, యువ కథానాయకుడు విక్కీ కౌశల్ గత ఏడాది ఆఖరులో... డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి... ఈ వారం వివాహ బంధంతో ఒక్కటి కానున్న నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్ళికి ఒక కనెక్షన్ ఉంది. అదేంటో తెలుసా?
కత్రీనా - విక్కీ పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్స్‌గా వర్క్ చేసిన వాళ్ళే... నయన్ - విఘ్నేష్ పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్స్‌గా చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు ఇద్దరూ సేమ్ కంపెనీకి పెళ్లి పనులు అప్పగించడం విశేషం.
నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విశేషాలు (The Vignesh Shivan Nayanthara Wedding: Seven things to know):
- నయన్ - విఘ్నేష్ పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? జూన్ 9న ఉదయం 8.30 గంటలకు!
- మహాబలేశ్వరంలోని ఒక రిసార్టులో నయనతార - విఘ్నేష్ శివన్ ఏడడుగులు వేయనున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
- గ్లాస్ హౌస్‌లో నయన్ - విఘ్నేష్ పెళ్లి జరగనుంది. అందుకు, మహాబలేశ్వరంలోని సముద్ర తీరంలో గల రిసార్టులో గ్లాస్ హౌస్ మండపం రెడీ అవుతోంది.
- పెళ్లి కోసం మూడు రోజుల పాటు రిసార్ట్ బుక్ చేశారు. పెళ్ళికి ముందు మెహందీ / సంగీత్ వేడుక జరుగుతుందని సమాచారం. పెళ్లి తర్వాత రోజు కూడా నూతన వధూవరులతో పాటు అతిథులు అక్కడే ఉంటారట.
- కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులను మాత్రమే పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. అందరికీ డ్రస్ కోడ్ ఉంటుందని ముందే చెప్పారట. ఫోనుల్లో ఫోటోలు తీయవద్దని రిక్వెస్ట్ చేశారట.
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసిన నయన్ - విఘ్నేష్ పెళ్ళికి ఆహ్వానించారు.
- నయన్ - విఘ్నేష్ పెళ్లిని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ షూట్ చేయనున్నారని చెన్నై టాక్. పెళ్లి వేడుక అంతా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Also Read: నయనతారను తిరుపతిలో ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో చెప్పిన విఘ్నేష్ శివన్
Also Read: రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ రోల్ ఏంటంటే?
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion