News
News
వీడియోలు ఆటలు
X

Vidudhala Trailer : విజయ్ సేతుపతి ప్రజా దళం మీద పోలీసుల ఉక్కుపాదం - 'విడుదల' ట్రైలర్

తమిళ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్ లో వచ్చిన విడుతలై పార్ట్ 1 తెలుగు ట్రైలర్ విడుదల పార్ట్ -1 రిలీజైంది. పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

FOLLOW US: 
Share:

Vidudhala Part 1 : టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్‌ తమిళంలో తీసిన 'విడుతలై పార్ట్ 1'ను తెలుగులో 'విడుదల' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సూరి హీరోగా, విజయ్ సేతుపతి స్పెషల్‌ రోల్‌ లో నటించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. 

రియలిస్టిక్‌ పోలిస్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న విడుదల మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూరి యాక్షన్ ఫైట్స్, విజయ్ సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ప్రజా దళం నాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించారు. ఆ దళాన్ని అణిచివేయడం కోసం పోలీసులు ఎన్కౌంటర్లు, కూంబింగ్లు మొదలు పెడతారు. ఆ పోలీసుల్లో సూరి ఒకరు. ఉన్నత అధికారులు అతడిని ఏ విధంగా చూశారు? ఆ తర్వాత ఏమైంది? అనేది కథగా తెలుస్తోంది. 

Also Read  'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్ సైతం సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో మారన్ తెలుగులోనూ హిట్ కొట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్ పై నెటిజన్లు ఇంట్రస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళంలో విడుతలై ను చూసిన కొందరు ఫ్యాన్స్ .. ఇప్పుడు తెలుగు వెర్షన్ లోనూ చూసి, ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగు ఫ్యాన్స్ ఎవరూ ఈ సినిమాను మిస్ చేసుకోవద్దని, అందరూ చూడాలంటూ సూచిస్తు్న్నారు.

ఇదిలా ఉండగా నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు వెట్రిమారన్ ఇప్పటికే తమిళంలో విడుతలై తీసి మంచి హిట్ కొట్టారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించిన మారన్.. పార్ట్ 1 పేరుతో తీసి, ఈ ఏడాది మార్చి 31 రిలీజ్ చేశారు. ఈ మూవీలో తమిళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హాస్య నటుడు సూరి హీరోగా కనిపించగా, ఇప్పటికే తన టాలెంట్ తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించి, మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.  

Also Read : మతిపోగొట్టిన పృథ్వీరాజ్ - రాజమౌళి తర్వాత ఆస్కార్ తెచ్చేది ఆయనేనా?

ఈ క్రమంలోనే వెట్రిమారన్  తీసిన విడుతలై  ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందాన్ని సర్ఫ్రైజ్ చేశారు. అప్పటికే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు్న్న వారికి తన అసిస్టెంట్స్ అందరికీ ప్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చిన వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ మూవీ సక్సెస్ కి కారణం అయిన 25 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు వెట్రి మాన్ ఒక్కొక్కరి ఒక ఫ్లాట్ కొనిచ్చారనే వార్త వైరల్ గా మారింది. అంతేకాదు మూవీ టీమ్ మొత్తానికి ఆయన బంగారు నాణేన్ని బహుమతిగా ఇచ్చారని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

ఇక ఈ సారి విడుతలై పార్ట్ 1 కు తెలుగు వెర్షన్ విడుదల పార్ట్ 1 రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీ.. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా విడుదలవుతోంది. ఇక స్టోరీ బేస్డ్ సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నిర్మాత అల్లు అరవింద్.. పలు భాషల్లో తీసిన సినమాలను డబ్ చేయడంలో ప్రోత్సహిస్తూ ఉంటారు. అందులో భాగంగా కన్నడ బ్లాక్ బస్టర్ 'కాంతార'ను తెలుగులో విడుదల చేసిన ఆయన.. ఈ విడుదల సినిమాను సైతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 
 
పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'విడుదల పార్ట్ 1' కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఒకేసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినట్టు సమాచారం. తమిళనాట థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి.

 ఇక వెట్రిమారన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రీ, ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారట. 

Published at : 08 Apr 2023 01:13 PM (IST) Tags: Ilaiyaraaja Soori Vidudhala Part 1 Vetri Maaran VijaySethupathi

సంబంధిత కథనాలు

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

ముంబై షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'

ముంబై షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?

Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

టాప్ స్టోరీస్

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !