Game Changer : 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుండి వీడియో లీక్ - నెట్టింట వైరల్ అవుతున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సీన్!
Game Changer : రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సెట్స్ నుంచి ఓ వీడియో లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది.
Game Changer Shooting Video Leak : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తప్పితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండున్నరేళ్లు దాటిపోయింది. అయినా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తోంది. సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూసి అలసిపోయిన ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు లీక్డ్ ఫోటోలు, వీడియోలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'గేమ్ చేంజర్' నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
'గేమ్ ఛేంజర్' సెట్స్ నుంచి వీడియో లీక్
'గేమ్ చేంజర్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని మూవీ టీం చిత్రీకరిస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలో ఓ ప్రధాన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా దాన్ని వీడియో తీసి నెట్టింట లీక్ చేసారు. ఈ వీడియోలో ఓ హెలికాప్టర్ మార్కెట్లో ల్యాండ్ అవుతూ కనిపించింది. సినిమాలో రామ్ చరణ్ హెలికాప్టర్ తో మార్కెట్లో హై ఎలివేషన్స్ తో ల్యాండ్ అవుతారట. థియేటర్లో ఈ ఎలివేషన్ సీన్ కి గూస్ బంప్స్ గ్యారంటీ అని చెబుతున్నారు. కొందరు షూటింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లీకైన ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ఎవరూ లీక్ చేశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
#Gamechanger leaked video 🔥 pic.twitter.com/3KA0hWZGB1
— శేఖర్ (@shekaralwayss) February 23, 2024
'గేమ్ ఛేంజర్' రిలీజ్ పై నో క్లారిటీ
'గేమ్ చేంజర్' షూటింగ్ జూన్ నాటికి అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. కానీ ఇప్పటిదాకా రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో 'గేమ్ చేంజర్' సినిమాని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కానీ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'OG' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' ని దసరాకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా.. ఆ సమయానికి ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ అవుతోంది. దాంతో అసలు రిలీజ్ ఎప్పుడనేది ఫ్యాన్స్ కి క్లారిటీ లేకుండా పోయింది.
యాక్షన్ అండ్ పొలిటికల్ కథాంశంతో
ఓ సామాజిక అంశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రాండియర్ గా సినిమాని తెరకెక్కించే శంకర్.. 'గేమ్ చేంజర్' కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. రామ్ చరణ్ ఇమేజ్ కి సూట్ అయ్యేలా యాక్షన్ తో పాటు పొలిటికల్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : మా నాన్న ఏం చెప్పారో నాకు తెలియదు, ఆ విషయంలో ఇంకా సిగ్గుపడుతున్నాను - జాన్వీ కపూర్