Vidaamuyarchi Teaser: హాలీవుడ్ రేంజ్‌లో 'విడాముయార్చి' టీజర్... గుడ్ బ్యాడ్ అగ్లీ కాదు, సంక్రాంతికి వచ్చేది ఈ సినిమాయే
Vidaamuyarchi Release Date: అజిత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. దాంతో పాటు సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 'విడాముయార్చి'. అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి.
సంక్రాంతికి 'విడాముయార్చి' విడుదల
అజిత్ కుమార్, అర్జున్ సర్జా, రెజీనా కెసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న కోలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విడాముయార్చి'. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025 జనవరిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు మేకర్స్.
టీజర్ మొత్తం 48 సెకండ్ల పాటు ఉండగా, అందులో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం. మొత్తం విదేశాల్లోని పలు లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలను టీజర్ లో చూపించారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక అజిత్ టీజర్ లో నలుపు రంగు టీ షర్ట్, బ్రౌన్ జాకెట్ తో సన్ గ్లాసెస్ పెట్టుకొని మరింత స్టైలిష్ లుక్ లో కనిపించారు. టీజర్ మొత్తంలోనూ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుగా కన్పించాడు అజిత్. అలగే త్రిష కృష్ణన్ ను డేటింగ్ లో కలుసుకోవడం, అజిత్ ఏదో వెతుకుతున్నట్టుగా కనిపించడం, చివర్లో అతని ముఖం అంతా రక్తసిక్తమై కనిపించడం, అతను ఎమోషనల్ గా మోకాళ్ళపై కూలబడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Relentless effort meets unstoppable action! 🔥 The VIDAAMUYARCHI teaser is OUT NOW. ▶️ Perseverance paves the way to triumph. 🌟
— Lyca Productions (@LycaProductions) November 28, 2024
🔗 https://t.co/ptOYpJ2LQW#VidaaMuyarchi In Cinemas worldwide from PONGAL 2025!#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran… pic.twitter.com/1u5cWYALb9
టీజర్ లో కనిపించిన చిన్న చిన్న క్లిప్స్ లో అర్జున్, రెజినా విలన్లుగా నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి చాలామంది ఈ 'విడాముయార్చి' టీజర్ ని చూశాక మూవీ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే టీజర్ చాలా సాదాసీదాగా, రిపీటెడ్ ఫ్రేమ్ లతో, షాట్లతో కనిపించడం ప్రేక్షకులను నిరాశపరిచింది. సినిమా స్టోరీ ఏంటి అనే విషయం ఏ మాత్రం అర్థం కాకుండా టీజర్ ని కట్ చేశారు. అలాగే అజిత్ ఇందులో కొత్తగా కనిపించకపోవడం డిసప్పాయింట్ చేసింది. ఎప్పటిలాగే అజిత్ అదే సీరియస్ ఫేస్, ఎమోషన్ తో కంపించారు .
Also Read: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'తునివు' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అజిత్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ టీజర్ ఆశించిన స్థాయిలో లేదు అనేది కొంతమంది మూవీ లవర్స్ మాట. ఇక ఈ మూవీ హాలీవుడ్ చిత్రం 'బ్రేక్ డౌన్' నుంచి ఇన్స్పిరేషన్ పొందిందని పుకార్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ట్రైలర్ తోనైనా టీజర్ ద్వారా వచ్చిన డిసప్పాయింట్మెంట్ ను తొలగిస్తారా? అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మూవీని పొంగల్ కానుకగా 2025 జనవరి 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?