Raju Weds Rambai: వేణు ఊడుగుల కాన్ఫిడెన్స్ ఏంటో... ప్రేమిస్తే, ఆర్ఎక్స్100, బేబీతో కంపేరిజన్!
Venu Udugula On Raju Weds Rambai: 'ఆర్ఎక్స్ 100', 'బేబి' సినిమాల తరహాలో 'రాజు వెడ్స్ రాంబాయి' తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని నిర్మాత వేణు ఊడుగుల చెప్పారు.

Raju Weds Rambai OTT Platform: నవంబర్ 21న 'రాజు వెడ్స్ రాంబాబు' రిలీజ్. ఈటీవీ విన్ ఓటీటీ కోసం తీసిన ఒరిజినల్ చిత్రమిది. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ సాధించడంతో ఆ స్ట్రాటజీ ఫాలో అవుతూ ఈ సినిమానూ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. రాహుల్ మోపిదేవితో కలిసి 'నీదీ నాదీ ఒకే కథ', 'విరాట పర్వం' చిత్రాల దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించారు. విడుదల తేదీ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు మరింత హైప్ పెంచేలా ఉన్నాయి.
ప్రేమిస్తే నుంచి బేబీ వరకు... అటువంటి సినిమా!
ఖమ్మం, వరంగల్ మధ్య ఓ ఊరిలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా 'రాజు వెడ్స్ రాంబాయి' కథను దర్శక రచయిత సాయిలు కంపాటి రాసుకున్నాడని వేణు ఊడుగుల చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ప్రేమతో కూడిన విషాద భరిత సంఘటనకు సాక్ష్యం ఈ ఊరిలో సమాధి అయ్యింది. కథ ఆధారం అది. నన్ను చాలా కదిలించింది. వినోదం, మాస్ అప్పీల్ ఉండేలా సాయిలు రాశాడు. ఈటీవీ విన్ వల్లే నేను నిర్మాతనయ్యా. '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' నిర్మించా. ఇప్పుడు నవంబర్ 21న 'రాజు వెడ్స్ రాంబాయి'న విడుదల చేస్తున్నాం. '7జీ బృందావన్ కాలనీ', 'ప్రేమిస్తే', 'ఆర్ఎక్స్ 100', 'బేబీ' తరహాలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది'' అని చెప్పారు.
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డా నాగేశ్వర రావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ సంస్థలపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Also Read: అప్పుడు అమ్మను రానివ్వలేదు... ఇప్పుడు కూతుర్ని మహేష్ ఫ్యాన్స్ వద్దంటారా?
''నేను సినిమా చూశా. నా మనసుకు హత్తుకున్న కథ ఇది. కొందరి జీవితాల్లో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సినిమా చూసి ఎమోషనల్ ఫీల్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు'' అని చెప్పారు. ''పక్కా తెలంగాణ చిత్రమిది. ఇందులో తెలంగాణ నేటివిటీ, ఇక్కడి ప్రజల జీవితాలను చూస్తాం'' అని చైతు జొన్నలగడ్డ చెప్పారు. ఈటీవీ విన్ నితిన్ మాట్లాడుతూ... ''మన ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవ ఘటన నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఆ ఘటన గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. 'రాజు వెడ్స్ రాంబాయి' రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకుంటారు'' అని చెప్పారు.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
Raju Weds Rambai Cast And Crew: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్ జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి'లో శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లు: ప్రియాంక వీరబోయిన - ఆర్తి విన్నకోట, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్, సంగీతం: సురేష్ బొబ్బిలి, కూర్పు: నరేష్ అడుపా, నిర్మాతలు: వేణు ఊడుగుల - రాహుల్ మోపిదేవి, రచన - దర్శకత్వం: సాయిలు కంపాటి, ప్రొడక్షన్: ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, థియేట్రికల్ రిలీజ్: వంశీ నందిపాటి, 'బన్నీ' వాస్.





















