అన్వేషించండి

Venkatesh - Trivikram: మాటల మాంత్రికుడితో వెంకటేశ్.. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌కి మించి అంటున్న ఫ్యాన్స్

ఓ ముగ్గురు నలుగురు హీరోలకే పరిమితమైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అప్పుడప్పుడు రూట్ మారుస్తుంటాడు. తాజాగా వెంకటేష్ లాండ్ మార్క్ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్టు టాక్..

మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం యంగ్ హీరోలకే పరిమితమయ్యాడు. స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ తోనే వరుస మూవీస్ చేస్తూ వస్తున్నాడు. మధ్యలో అ ఆ లాంటి మూవీ తెరకెక్కించినా మళ్లీ స్టార్ హీరోలవైపే త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నాడు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత రూట్ మార్చిన త్రివిక్రమ్ ఇప్పుడు సీనియర్ హీరోతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకలో… త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నట్టు చిరంజీవి చెప్పినా ఆ ప్రాజక్ట్‌పై ఇప్పటి వరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ వరుసగా సినిమాలకు కమిటయ్యారు. నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్టు 2017 వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసినా… దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్ డేట్ రాలేదు.

Venkatesh - Trivikram: మాటల మాంత్రికుడితో వెంకటేశ్.. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌కి మించి అంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం మాటల మాంత్రికుడు వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి పక్కా అంటున్నారు. అయితే త్రివిక్రమ్‌తో వెంకటేశ్ చేయబోయే సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ రీమేకా.. లేకపోతే, హిందీలో హిట్టైన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ రీమేకా అని తెలియాల్సి ఉంది. ఇప్పటికే వెంకటేష్.. త్రివిక్రమ్‌తో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. మరిప్పుడు ఏ మూవీతో ఇద్దరూ వస్తారన్నది తెలియాల్సి ఉంది.

Venkatesh - Trivikram: మాటల మాంత్రికుడితో వెంకటేశ్.. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌కి మించి అంటున్న ఫ్యాన్స్

వెంకటేష్ సూపర్ హిట్ మూవీస్ 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' కి త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశాడు. ఆ రెండు సినిమాల్లో డైలాగ్స్ ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారీ డైలాగ్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు మొదట్లో ఈ డైలాగ్స్ జోరుని అర్థం చేసుకునేందుకు కాస్త టైం పట్టినా ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు బుల్లితెరపై ప్రసారం అయితే రిమోట్ పక్కన పెట్టి డైలాగ్స్ చెప్పుకుంటూ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారు. అప్పట్లో మాటల మాంత్రికుడు మాటలందించిన సినిమాలే ఆ రేంజ్ లో హిట్టైతే… ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా లెక్కే వేరప్పా అంటున్నారు వెంకీ ఫ్యాన్స్. మరోవైపు ఇప్పటి వరకూ యంగ్ హీరోలతో మాత్రమే సినిమాలు తీసిన త్రివిక్రమ్...సీనియర్ హీరోలవైపు చూడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరి హీరో-మాటల రచయితగా సూపర్ హిట్టైన ఈ కాంబినేషన్ హీరో-దర్శకుడిగా తిరుగులేకుండా ఉంటుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget