Operation Valentine Release Date: 'ఆపరేషన్ వాలెంటైన్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది - ఆ తేదీనే ఫిక్స్ చేసిన టీం
Operation Valentine Release Date: మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందుతోంది.
![Operation Valentine Release Date: 'ఆపరేషన్ వాలెంటైన్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది - ఆ తేదీనే ఫిక్స్ చేసిన టీం Varun Tej Operation Valentine New Release Date Announced on 1st March 2024 Operation Valentine Release Date: 'ఆపరేషన్ వాలెంటైన్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది - ఆ తేదీనే ఫిక్స్ చేసిన టీం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/ac97f450576ad79cd8a8697c1023357b1706963880825929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Operation Valentine Release Date: మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ నిర్మించారు. వరుణ్ తేజ్ హిందీలో నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలంటైన్ నుంచి వస్తున్న అప్‌డేట్ మూవీపై క్యూరియసిటీ పెంచుతున్నారు. రీసెంట్‌గానే వాఘా బోర్డర్ వద్ద వందేమాతరం పాటను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అయితే పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను మొదటి నుంచి విడుదల సమస్య వెంటాడుతుంది. ఎప్పుడో పూర్తయిపోయిన ఈ సినిమా డేట్ వరుసగా వాయిదా పడుతుంది. మొదట ఈ సినిమాను డిసెంబరు 8న రిలీజ్ చేస్తామని చెప్పారు మేకర్స్. అయితే ఏమైందో ఏమో సినిమాను రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 16కు వాయిదా పడింది.
Also Read: షాకిస్తున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' మూవీ ఫస్ట్‌డే కలెక్షన్స్ - ఎన్ని కోట్లు వచ్చాయంటే!
ఈ తేదీ కూడా మారిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 26 లేదా మార్చి 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అంతా ఫిబ్రవరి 26నే ఈ మూవీ వస్తుందనుకున్నారు. కానీ తాజాగా ఈ తేదీలో మార్పులు చేసింది మూవీ యూనిట్. ఆపరేషన్ వాలంటైన్ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసి తాజాగా ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఈ సినిమాకు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Locking the target on March 1st 2024!
— Varun Tej Konidela (@IAmVarunTej) February 3, 2024
See you in cinemas!🇮🇳#OperationValentine pic.twitter.com/ouBQ3PpLrT
మెగా ప్రిన్స్ ఈసారైన హిట్ కొడతాడా?
ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ పెద్దగా కలసి రావడం లేదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేసుకుంటుపోతున్నాడు కానీ ఈ మెగా హీరోకు ఆశించిన విజయం దక్కడం లేదు. గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఎన్నో అంచాల మధ్య వచ్చిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు దారుణ ఫలితాలు ఇచ్చాయి. దీంతో ఈసారి ఎలాగైన ఆపరేషన్ వాలెంటైన్ తో మెగా రేంజ్‌లో భారీ హిట్ కొట్టాలని ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమా చేయడం.. వరుణ్ తప్ప ఎవరూ తెలుగు వారు లేకపోవడంతో ఇక్కడ ఈ సినిమాకు పెద్దగా హైప్ కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ రిజల్ట్‌పై మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)