Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Niharika Konidela : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీకి 'బరి' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. నిహారిక కొణిదెల మూవీని నిర్మిస్తుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Varun Tej's New Movie Titled As Bhari First Look Revealed : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మెగా డాటర్ నిహారిక కొణిదెల మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
సంక్రాంతి 'బరి'... క్లాప్ కొట్టిన పవర్ స్టార్
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరైంది. చెల్లెలు నిహారిక నిర్మాణంలో అన్నయ్య హీరోగా నటిస్తోన్న మూవీకి 'బరి' అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. 'ఇక బరిలో దూకుదామా?' అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ మూవీలో వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో వరుణ్ తేజ్ డిఫరెంట్ రోల్‌లో నటించనున్నారు. 'కమిటీ కుర్రోళ్లు' ఫేం యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
అన్నయ్య హీరో... చెల్లెలు ప్రొడ్యూసర్
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. తొలుత యూట్యూబ్ సిరీస్‌లు, ఆ తర్వాత వెబ్ సిరీస్‌లు తీశారు. ఆ తర్వాత కమిటీ కుర్రోళ్లు తీసి ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా హారర్ ఫాంటసీ 'రాకాస'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఎప్పటి నుంచో తన అన్న వరుణ్ తేజ్‌తో ఆమె మూవీ నిర్మించడంపై ఊహాగానాలు వినిపించాయి. ఫైనల్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసిన యదు వంశీనే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించడం మరో విశేషం. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగా హీరో మూవీ కన్ఫర్మ్ అయిపోయింది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















