అన్వేషించండి

Varun Tej Lavanya Tripathi: ఓటీటీలో వరుణ్, లావణ్య పెళ్లి వీడియో - అసలు విషయాన్ని బయటపెట్టిన వరుణ్ తేజ్ టీమ్!

వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వీడియోని ఓటీటీలో ప్రసారం చేయబోతున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవాలని తాజాగా వరుణ్ తేజ్ టీం ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే కదా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఇటలీలోని టస్కానీలో వరుణ్, లావణ్య వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లికి మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, అతి కొద్ది మంది బంధువులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే.

పెళ్లి తర్వాత తాజాగా హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఇక్కడ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్య పెళ్లికి సంబంధించిన వీడియోను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని, అభిమానుల కోసం మెగా ఫ్యామిలీ పెళ్లి వీడియోను ఓటీటీకి ఇచ్చారని వార్తలు వినిపించాయి. అంతేకాదు వరుణ్, లావణ్య వివాహానికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.8 కోట్లకు దక్కించుకుందని న్యూస్ వచ్చింది. గత రెండు రోజుల నుంచి ఈ న్యూస్ మరింత వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు వరుణ్ తేజ్ టీం దీనిపై స్పందించి అసలు విషయాన్ని వెల్లడించింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లన్నీ నిజం కావని, అదంతా ఫేక్ న్యూస్ అని వరుణ్ తేజ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుణ్ తేజ్ టీం స్పందిస్తూ.." వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్ని అవాస్తవమైనవి. ఇలాంటి పుకార్లను ఎవరు నమ్మవద్దు, వ్యాప్తి చేయవద్దని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం" అని ట్వీట్ చేయడంతో వరుణ్, లావణ్య పెళ్లి ఓటీటీ హక్కుల గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటికి వచ్చాయి. వీడియోలు ఎక్కువగా రాలేదు.

దీంతో వీరి పెళ్లి వీడియో ఫుటేజ్ ని ఓటీటీకి ఇవ్వబోతున్నారన్న పుకార్లు ఎక్కువైపోయాయి. కానీ తాజాగా వరుణ్ తేజ్ టీం ఆ పుకార్లు నిజం కాదని స్పష్టం చేసింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సినీ కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున' అనే సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీలో నటిస్తున్నాడు. మానుషి చిల్లర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలేవి చేయడం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఈమె లీడ్ రోల్ ప్లే చేసిన 'పులి మేక' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Also Read : దంచి కొట్టు, త్రివిక్రమ్ మార్క్ మాస్ సాంగ్ - మహేష్ 'దమ్ మసాలా' వచ్చేసిందోయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagapathi Babu: ఇప్పుడు సుఖంగా ఉంది - మొహమాటం లేకుండా చెప్పిన జగపతి బాబు
ఇప్పుడు సుఖంగా ఉంది - మొహమాటం లేకుండా చెప్పిన జగపతి బాబు
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Embed widget