అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Varsha Bollamma Interview: రాజ్ తరుణ్ నాకు మేల్ వెర్షన్ - వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండ్ అప్ రాహుల్'. మార్చి 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో వర్ష బొల్లమ్మ ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవి...
"రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేశారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ, వర్క్ షాప్స్ చేసేటప్పుడు తెలిసిపోయింది. నాకు రాజ్ తరుణ్ మేల్ వెర్షన్ అని! అతను జోక్స్ చెప్పే విధానం, హుషారుగా ఉండటం చూస్తే... నన్ను నేను చూసుకునట్టు ఉంది. నేను కంఫర్ట్ ఫీల్ అయ్యాను" అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు.
రాజ్ తరుణ్‌కు జంటగా వర్ష బొల్లమ్మ నటించిన సినిమా 'స్టాండ్ అప్ రాహుల్'. కూర్చుంది చాలు... అనేది ఉపశీర్షిక. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. మార్చి 18న విడుదలకు సిద్ధమైంది. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి, మిగతా అంశాల గురించి వర్ష బొల్లమ్మ చెప్పిన విశేషాలు ఇవి...
- కొవిడ్ తర్వాత ప్రజలు అందరూ ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చింది. ఈ తరుణంలో అందరూ థియేటర్లకు వెళ్లి హాయిగా నవ్వుకుని బయటకు వచ్చేలా ఓ సినిమా ఉండాలని నాకు అనిపించింది. అటువంటి చిత్రమే ఇది.
- 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాలో నా పాత్ర పేరు శ్రేయా రావు. ఆమెకు అంటూ కొన్ని కలలు ఉంటాయి. తన కలల కోసమే కాదు, తన పార్ట్‌నర్ డ్రీమ్స్ కోసం నిలబడే అమ్మాయి పాత్ర. హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ సమానంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కళ్లజోడు పెట్టుకుని కొంత డిఫరెంట్ గా కనిపిస్తా.
- 'స్టాండ్ అప్ రాహుల్' సినిమా గురించి చెప్పిన తర్వాత... నా స్నేహితులు, నా గురించి తెలిసిన వారు నేనే స్టాండప్ కామెడీ చేస్తున్నానని అనుకున్నారు. సాధారణంగా నేను హైపర్ యాక్టివ్. కుళ్ళు జోక్ లు వేస్తుంటా. అయితే... ఈ సినిమాలో స్టాండ్ అప్ కామెడీ చేసే ఛాన్స్ రాలేదు. కానీ, కామెడీ చేశా. 'వెన్నెల' కిశోర్‌తో సన్నివేశాలు చేయడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే... ఆయన స్పాంటేనియస్‌గా సీన్స్ చేసేవారు. నవ్వు ఆపుకోవడం కష్టం అయ్యేది.
- 'స్టాండ్ అప్ రాహుల్' కోసం వర్క్ షాప్స్ చేశాం. ఈ సినిమాకు మాత్రమే కాదు, తెలుగులో కథానాయికగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'చూసీ చూడంగానే' సినిమాల కోసం కూడా నేను వర్క్ షాప్స్ చేశా. విజయ్ 'బిగిల్' కోసం కూడా మూడు నెలలు ఫుట్ బాల్ నేర్చుకున్నాను. వర్క్ షాప్స్ చేయడం వల్ల చాలా బాగా నటించగలుగుతాం.
- కథానాయికగా నేను సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. అయితే... నేను సెలెక్టివ్‌గా చేయడం లేదు. సెలెక్టివ్‌గానే నాకు అవకాశాలు, పాత్రలు వస్తున్నాయి. ఇటువంటి పాత్రలు చేయాలని రూలేమి పెట్టుకోలేదు. పదేళ్ళ క్రితంతో పోలిస్తే... ఇప్పటికి పాత్రల్లో చాలా మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement