అన్వేషించండి

Varsha Bollama: బోల్డ్ పాత్రలపై వర్షా బొల్లామా కామెంట్స్ - అలా చేయడానికి చాలా ధైర్యం కావాలి, కానీ..

Varsha Bollama: క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన వర్షా బొల్లామా.. ప్రస్తుతం హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతోంది. తాజాగా బోల్డ్ పాత్రలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

Varsha Bollama: యంగ్ బ్యూటీ వర్షా బొల్లామా.. ‘జాను’ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఒక్క సీన్‌లోనే తనను చూసి ఫిదా అయిపోయిన తెలుగు మేకర్స్.. తనకు హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా వీఐ ఆనంద్, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊరు పేరు భైరవకోన’లో హీరోయిన్‌గా నటించి మరోసారి ప్రేక్షకుల మార్కులు కొట్టేసింది వర్షా. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ తను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుంది, అసలు ‘ఊరు పేరు భైరవకోన’ అవకాశం తనకు ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. దాంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అలాంటిది ఎప్పుడూ చేయను..

ఇప్పటివరకు వర్షా బొల్లామా ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించింది. అయితే అలాంటి పాత్రలే చేయడానికి కారణం ఏమైనా ఉందా అని అడగగా.. ‘‘ఆ పాత్రలే నన్ను సెలక్ట్ చేసుకుంటున్నాయి. నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. నేను స్వీట్‌గా ఉంటానని, ఎక్కువగా అలాంటి పాత్రలే వస్తాయి. దానికి నా మొహమే కారణం అయ్యిండొచ్చు. దాని వల్ల నాకు ఇలాంటి పాత్రలు ఎక్కువగా వస్తాయి’’ అంటూ ఎప్పుడూ ఒకే విధమైన పాత్రలు చేయడంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది వర్షా. ఇక బోల్డ్ పాత్రలు చేయడంపై స్పందిస్తూ.. ‘‘స్క్రిప్ట్‌లో అలాంటివి ఉంటే నేను వాటి గురించి ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు అది నా ప్రాధాన్యత కాదు. అలాంటి పాత్రల్లో నేనెప్పుడూ అంత సౌకర్యంగా లేను. సౌకర్యంగా లేనిది నేనెప్పుడూ చేయను’’ అని తెలిపింది.

చిన్నప్పటి నుండే కోరిక..

అలాంటి పాత్రలు తను చేయడం లేదని, చేసేవారిని కించపరుస్తున్నట్టు కాదు అని క్లారిటీ ఇచ్చింది వర్షా బొల్లామా. ‘‘అలాంటి పాత్రలు చేసేవారు పర్ఫార్మెన్స్ చేయరు అని నేను అనడం లేదు. గ్లామర్ రోల్ చేసేవారికి పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండదు లాంటివి నేను చెప్పను. అలా చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఒక అమ్మాయిగా నేను వాళ్లను ప్రశంసిస్తాను, సపోర్ట్ చేస్తాను’’ అని తెలిపింది. కానీ తను ఇంటికి వెళ్లి ఎందుకిలా చేశాను అని ఆలోచించే పాత్రలు మాత్రం ఎప్పటికీ చేయను అని తేల్చి చెప్పింది. తనకు చిన్నప్పటి నుండి నటి అవ్వాలని కోరిక ఉండేదని బయటపెట్టింది. చదువు పూర్తి చేయాలని కాబట్టి, బయోలజీ అంటే ఇష్టం కాబట్టి మైక్రో బయోలజీ పూర్తి చేశానని చెప్పింది.

అది ఊహించలేదు..

వర్షా బొల్లామా హీరోయిన్‌గా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’కు దర్శకుడిగా వ్యవహరించాడు వీఐ ఆనంద్. అయితే తను ఇంతకు ముందు తెరకెక్కించిన ‘ఎక్కడికి పోతావా చిన్నవాడా’ తాను చూశానని, తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది వర్షా బొల్లామా. ఆయన చాలా టాలెంటెడ్ అని, డిఫరెంట్‌గా ఆలోచిస్తాడని ప్రశంసించింది. భూమి అనే పాత్రకు కావాల్సిన అమాయకత్వం దర్శకుడు తన మొహంలో చూసుంటాడని అభిప్రాయం వ్యక్తం చేసింది. తనను మంచి పర్ఫార్మెర్ అని ఆనంద్ అంటుండేవారని గుర్తుచేసుకుంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా ముఖ్యమని చెప్పింది వర్షా. ‘ఊరు పేరు భైరవకోన’లో ‘నిజమేనే చెబుతున్న’ పాట ఆ రేంజ్‌లో హిట్ అవుతుందని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. 

Also Read: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్‌కు వెళ్లిపోతా - సందీప్ రెడ్డి వంగా

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget