అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sandeep Reddy Vanga: వాళ్లు అలా చేస్తే హాలీవుడ్‌కు వెళ్లిపోతా - సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: భాషతో సంబంధం లేకుండా తెలుగులో ఒకటి, హిందీలో రెండు చిత్రాలు తెరకెక్కించి హిట్లు కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఇక త్వరలోనే తన హాలీవుడ్ ప్లాన్స్ గురించి కూడా బయటపెట్టాడు.

Sandeep Reddy Vanga about Hollywood: కేవలం మూడు సినిమాలతోనే టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ముఖ్యంగా తను తాజాగా తెరకెక్కించిన ‘యానిమల్’ అయితే వేరే రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ చాలామంది ప్రశంసలు అందుకోగా.. అంతకంటే ఎక్కువమంది ప్రేక్షకులు దీనిని విమర్శించారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు.. బాలీవుడ్‌లోని పాపులర్ క్రిటిక్స్ సైతం ‘యానిమల్’పై తెగ సీరియస్ అయ్యారు. ఎన్నో విమర్శలు చేశారు. వారి విమర్శలకు సందీప్.. ఎప్పటికప్పుడు గట్టి సమాధానం చెప్తూ వచ్చాడు. తాజాగా మరోసారి ఆ విమర్శలపై స్పందించాడు సందీప్ రెడ్డి వంగా.

విపరీతమైన విమర్శలు..

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’లో మహిళలపై హింసను ప్రోత్సహించారని, మితిమీరిన వైలెన్స్ ఉందని, కొన్ని సీన్స్ ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తాయని.. ఇలా ఎన్నో విధాలుగా విమర్శించారు బాలీవుడ్ క్రిటిక్స్. ఈ విమర్శలు ఏవీ తన సినిమాను ఆపలేవని సందీప్ రెడ్డి వంగా చాలా నమ్మకంతో ఉన్నాడు. చివరికి తన నమ్మకమే నిజం అయ్యింది. కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు సృష్టించింది ‘యానిమల్’. సినిమాను సినిమాలాగా చూడాలి అనే అభిప్రాయంతో కొందరు.. ఈ మూవీకి ఫిదా అయ్యి పాజిటివ్‌గా మాట్లాడినా కూడా మరికొందరు మాత్రం ఇలాంటి సినిమా తప్పకుండా ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తుందని విమర్శించారు. ఇక ఇలాగే విమర్శలు చేస్తే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోతానని సందీప్ రెడ్డి వంగా తాజాగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్..

‘‘నాకు భాషతో సంబంధం లేదు. నేను సినిమాలు చేయాలి అంతే. ఇండియాలో క్రిటిక్స్ నన్ను ఆపితే.. నేను హాలీవుడ్‌కు వెళ్తా’’ అని తాజాగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటికే పలుమార్లు క్రిటిక్స్ అనేవారు కేవలం తనను టార్గెట్ చేయడానికే తన సినిమాపై విమర్శలు కురిపిస్తుంటారని అన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి వంగా.. రెండో మూవీ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక తన కెరీర్‌లో మూడు సినిమా కూడా బాలీవుడ్‌లోనే తెరకెక్కించాలని డిసైడ్ అయ్యి ‘యానిమల్’ చేశాడు. అలా తెలుగులో ఒకటి, హిందీలో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు సందీప్.

మరింత వైలెంట్‌గా ‘యానిమల్ పార్క్’..

‘యనిమల్’కు ఎన్ని విమర్శలు వచ్చినా దీని సీక్వెల్ తెరకెక్కించాలని సందీప్ రెడ్డి వంగా డిసైడ్ అయిపోయాడు. ఇప్పటికే దీని సీక్వెల్‌ ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ‘యానిమల్’కంటే ‘యానిమల్ పార్క్’లో వైలెన్స్ ఓ రేంజ్‌లో ఉందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన బేసిక్ కథ సిద్ధంగా ఉందని సమాచారం. ఈ ఏడాది చివరిలోపు స్క్రిప్ట్ పనులు దాదాపుగా ఫైనల్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2025లో ప్రారంభం కానుంది.

Also Read: బాధపడ్డ మాట వాస్తవమే- కలర్ గురించి వైవా హర్ష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget