అన్వేషించండి

Harsha Chemudu: బాధపడ్డ మాట వాస్తవమే- కలర్ గురించి వైవా హర్ష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్‌'. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.

Harsha Chemudu About His Colour: హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘వైవా’ షార్ట్ ఫిల్మ్ తో  సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత  పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన ఆయన, ఇప్పుడు మంచి అవకాశాలు పొందుతున్నాడు. తాజాగా హర్ష ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ అనే సినిమా తెరకెక్కింది. కల్యాణ్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆర్టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకంపై రవితేజ, సుధీర్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

మెగాస్టార్ చేతుల మీదుగా ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ విడుదల  

‘సుందరం మాస్టర్’ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హర్ష మీద ప్రశంసల జల్లు కురిపించారు. అతడు కూడా తనలాగే స్వయంకృషితో ఎదిగాడంటూ అభినందించారు. సోషల్ మీడియా అంతగా తెలియని రోజుల్లోనే తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. వైవా హర్ష లాంటి నటులు ఇంకా రావాలన్నారు. కొత్త ప్రయోగాలను, కొత్త కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని, హర్ష మూవీకి కూడా మంచి ఆదరణ దక్కాలని ఆకాంక్షించారు.   

తన కలర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హర్ష

ఇక తాజాగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో వైవా హర్ష కీలక విషయాలు వెల్లడించారు. తన కలర్, బరువు గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. “ నా కలర్, బరువు గురించి ఏమీ ఇబ్బంది ఫీల్ కాను. నేనే ఎలా ఉన్నా? నాలాగే ఉంటాను. అలా ఉండటమే నాకు ఇష్టం. ను నాలా ఉన్నందుకే చాలా మంది ఇష్టపడ్డారు. ఇష్టపడుతున్నారు. నాతో ఉంటున్నారు. సైజు, కలర్ అనేది మ్యాటర్ కాదు. చాలా మంది తాము ఎక్కువ బరువున్నాం. నల్లగా ఉన్నాం. అందంగా లేము అని బాధపడతారు. అయితే, ఇతర ఏ సమస్య గురించి అయినా బాధ పడవచ్చు. కానీ, రంగు, బరువు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నేను కూడా నా సైజు గురించి బాధపడే వాణ్ణి. కానీ, ఇప్పుడు దాని గురించి ఎలాంటి బాధ లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇలా ఉండటం హ్యాపీగా ఉంది” అని చెప్పుకొచ్చారు.

‘సుందరం మాస్టర్’ కథ ఏంటంటే?

ఇక ‘సుందరం మాస్టర్’ మాస్టర్ సినిమా కథ.. ఒక గ్రామంలో ఇంగ్లీష్‌ బోధించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడి స్టోరీని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామానికి ఇంగ్లీష్‌ టీచర్‌గా వెళ్లిన ‘సుందరం మాస్టర్‌’కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఇందులో చూపించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కటి వినోదాన్ని పంచుతుందని చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాకు దీపక్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.  

Read Also: ‘వార్ 2’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ లేకుండానే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP DesamRohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Telangana New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు కోసం అర్హతలివేనా?
HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి
Guinnes World Record: నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు - సూర్యాపేట వాసికి గిన్నిస్ రికార్డుల్లో చోటు
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?
Embed widget