అన్వేషించండి

Varanasi Movie: 'వారణాసి' ఒక్కటే... రెండో పార్టు లేదు - కన్ఫర్మ్ చేసిన రాజమౌళి, రన్ టైమ్ తెలుసా?

Varanasi Movie Runtime: 'వారణాసి' రెండు పార్టులుగా విడుదల అవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారం మొదలైంది. దానికి రాజమౌళి చెక్ పెట్టారు. సినిమా ఒక్కటేనని స్పష్టం చేశారు.

'బాహుబలి' (Baahubali)ని రెండు పార్టులుగా విడుదల చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. దానికి ముందు కొన్ని సినిమాలు రెండు పార్టులుగా విడుదల అయినప్పటికీ... పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కథలను రెండు సినిమాలుగా విడుదల చేయడం అనే ట్రెండ్ మొదలైంది. 'బాహుబలి' తర్వాత 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'ను ఒక్క సినిమాగా విడుదల చేశారు రాజమౌళి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న 'వారణాసి'ని సైతం రెండు పార్టులుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది. దానికి చెక్ పెట్టారు జక్కన్న.

రెండు పార్టులు కాదు... 'వారణాసి' ఒక్కటే!
'వారణాసి' రెండు పార్టులుగా విడుదల కానుందని ప్రచారం మొదలు కావడానికి అసలు కారణం...రిలీజ్ డేట్ పోస్టర్. 'వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ముందు 'గ్లోబ్ ట్రాటర్' అని పేర్కొనేవారు. గ్లింప్స్‌లో సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది జక్కన్న చెప్పారు. అప్పుడు 'గ్లోబ్ ట్రాటర్ - టైమ్ ట్రాటర్' అని పేర్కొన్నారు. కట్ చేస్తే... 'వారణాసి' రిలీజ్ డేట్ (ఏప్రిల్ 7, 2027) పోస్టర్ మీద 'గ్లోబ్ ట్రాటర్' ఒక్కటే రాశారు. దాంతో రెండు పార్టులు అనే ప్రచారం మొదలైంది.

'వారణాసి' మొదటి భాగానికి 'వారణాసి - గ్లోబ్ ట్రాటర్' అని, రెండో భాగానికి 'వారణాసి - టైమ్ ట్రాటర్' అని టైటిల్స్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలు అయ్యింది. అయితే... హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కథను ఒక్కటే పార్టులో చెబుతున్నామని, రెండు పార్టులుగా విడుదల చేసే ఆలోచన తమకు లేదని రాజమౌళి స్పష్టం చేశారు.

Also ReadMahesh Babu - Priyanka Chopra: 'వారణాసి'లో డ్యాన్స్ నంబర్ - హైప్ పెంచిన మహేష్, ప్రియాంక... 'నాటు నాటు'ను బీట్ చేస్తుందా?

''వారణాసి సింగిల్ పార్ట్ ఫిల్మ్. రన్ టైమ్ మూడు గంటలకు పైగా ఉంటుంది. మొదట రెండు పార్టులుగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం. అయితే ఆ ఆలోచనను వెంటనే పక్కన పెట్టేశాం. ఇప్పుడు 'వారణాసి' సింగిల్ పార్ట్ సినిమా'' అని స్వయంగా రాజమౌళి చెప్పారు. దాంతో రెండు పార్టులు అనే ప్రచారానికి ఇక శుభం కార్డు పడుతుందని చెప్పవచ్చు. స్వయంగా రాజమౌళి సెకండ్ పార్ట్ లేదని చెప్పిన తర్వాత 'వారణాసి 2' ఎక్కడ ఉంటుంది!?

Also Readమొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CinemaBlend (@cinemablend)

సుమారు 1300 కోట్ల నిర్మాణ వ్యయంతో 'వారణాసి' తెరకెక్కుతోంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన షోయింగ్ బిజినెస్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మహేష్ బాబు సరసన మందాకినీ పాత్రలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ రణకుంభ పాత్రను మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget