Vaishnavi Chaitanya : స్టార్ బాయ్‌తో రొమాన్స్ చేయనున్న 'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య!
'బేబీ'తో కథానాయికగా పరిచయమైన వైష్ణవి చైతన్య, తొలి సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అందులో స్టార్ బాయ్ సినిమా కూడా ఉందని టాక్.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) గురించి ప్రేక్షకులు ఎవరికైనా చెప్పాలంటే... 'బేబీ'కి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి! కథానాయికగా పరిచయమైన మొదటి సినిమాతో ఆమె భారీ విజయం అందుకున్నారు. ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పాపులారిటీతో పాటు ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. అందులో స్టార్ బాయ్ సినిమా కూడా ఉందని సమాచారం.
సిద్ధూ సరసన వైష్ణవి చైతన్య
'డీజే టిల్లు' సినిమాతో భారీ విజయం అందుకున్న యువ కథానాయకుడు సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). అంతకు ముందు ఆయన ఖాతాలో హిట్స్ ఉన్నాయి. 'గుంటూరు టాకీస్', 'కల్కి' చిత్రాల్లో పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా'తో హీరోగా కూడా విజయాలు అందుకున్నారు.
Siddhu Jonnalagadda New Movie : అయితే, 'డీజే టిల్లు' సిద్ధూ జొన్నలగడ్డకు స్టార్ట్ స్టేటస్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' చేస్తున్న ఆయన, ఆ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో ఓ సినిమా చేయనున్నారు. అలాగే, 'బొమ్మరిల్లు' భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశారు. అందులో వైష్ణవి చైతన్య నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
సిద్దూ జొన్నలగడ్డ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నాయికగా వైష్ణవి చైతన్యను కన్ఫర్మ్ చేశారట. దర్శకుడిగా పరిచయం అయిన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరు చేసుకున్న భాస్కర్, ఆ తర్వాత 'పరుగు', 'ఆరెంజ్', 'ఒంగోలు గిత్త' సినిమాలు చేశారు. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. అఖిల్ సినిమా తర్వాత మరోసారి మాంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉంటుందట. ఆ అవకాశం వైష్ణవికి వచ్చిందంటే పెద్ద ఛాన్స్ అని చెప్పాలి.
Also Read : విజయ్ దేవరకొండ మీద బురదజల్లే ప్రయత్నమా? మహేష్, రవితేజను ఇలా అడగగలరా?
సిద్ధూ జొన్నలగడ్డ, 'బొమ్మరిల్లు' భాస్కర్ సినిమాతో పాటు 'దిల్' రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ సరసన కూడా ఓ సినిమాకు సంతకం చేశారట వైష్ణవి చైతన్య.
Also Read : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?
Vaishnavi Chaitanya Career : 'బేబీ' సినిమా విడుదలకు ముందు తెలుగు ప్రేక్షకులకు వైష్ణవి చైతన్య ఓ యూట్యూబర్ అని మాత్రమే తెలుసు. అప్పటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లెలిగా 'అల వైకుంఠపురములో' సినిమా చేశారు. తమిళంలో స్టార్ హీరో అజిత్ 'వలిమై'లో ఓ పాత్ర చేశారు. 'రంగ్ దే', 'టక్ జగదీశ్', 'వరుడు కావలెను' సినిమాల్లో రోల్స్ చేశారు. అయితే... 'బేబీ' విజయం కథానాయికగా ఆమెకు బలమైన పునాది వేసింది. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. వాటిలో ఆచి తూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారట. 'బేబీ'తో కంపేర్ చేస్తే... ఇప్పుడు వైష్ణవి చైతన్య తన పారితోషికం కూడా పెంచారట. అదీ సంగతి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial