News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. ఈ సినిమా నుంచి 'ఉయ్యాలో ఉయ్యాల' అనే పాట లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు.

FOLLOW US: 
Share:

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'ఉయ్యాలో ఉయ్యాల' అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు. 

‘భగవంత్‌ కేసరి’ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రచార చిత్రాలు, గ్లిమ్స్, టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విడుదలైన 'ఉయ్యాలో ఉయ్యాల' సాంగ్ కూడా సంగీత ప్రియులను అలరిస్తోంది. 'ఉడతా ఉడతా ఉషా ఉష్.. సప్పుడు చెయ్యకురి.. నీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి' అంటూ తెలంగాణ జానపద శైలిలో ఈ పాట సాగింది. 

తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ‘భగవంత్‌ కేసరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించనుంది. 'ఉయ్యాలో ఉయ్యాల' పాటలో వీరిద్దరి మధ్య ప్రేమానురాగాలను, బాండింగ్ ను చూపించారు. స్కూల్ గర్ల్ గా, యుక్త వయసు అమ్మాయిగా శ్రీలీల చాలా అందంగా కనిపించింది. ఇందులో బాలయ్య తన కుమార్తెకు తల్లిగా మారి లాలి పాడటం, స్నానం చేయించడం, జడ వెయ్యడం, అన్నం తినిపించడం వంటివి మనసులను తాకుతాయి. మధ్యలో వచ్చే బతుకమ్మ లిరిక్స్ కూడా ఆకట్టుకుంటాయి. 

ఒక రకంగా 'ఉయ్యాలో ఉయ్యాల' అనేది తండ్రులు తమ పిల్లల కోసం పాడుకునే జోల పాటలా ఉంది. సంగీతంతో పాటుగా పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటుగా హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కూడా ఉన్నాయని ఈ పాట ద్వారా చెప్పకనే చెబుతున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ వినసొంపైన మెలోడీ ట్యూన్ కంపోజ్ చేసారు. గీత రచయిత అనంత్ శ్రీరామ్ నేపథ్యానికి తగ్గట్టుగా తెలంగాణ సాహిత్యం అందించగా, ఎస్పీ చరణ్ అద్భుతంగా ఆలపించారు. ఈ సాంగ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తిమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేసారు. 

'భగవంత్‌ కేసరి' చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Oct 2023 06:44 PM (IST) Tags: Nandamuri Balakrishna Sreeleela Kajal Aggarwal Bhagavanth Kesari Uyyaalo Uyyaala Song Thaman Musical

ఇవి కూడా చూడండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?