అన్వేషించండి

Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్

Star health insurance data leak: స్టార్‌ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల డేటా హ్యాక్‌.. 31 మిలియన్ల మంది డేటాను ఇన్‌స్టాగ్రామ్ చాట్‌బోట్స్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టినట్లు రాయిటర్స్ కథనం

Star health insurance data leaked : భారత్‌కు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల డేటా హ్యాకింగ్‌కు గురైన వార్త సంచలనం రేపుతోంది. ఈ సంస్థకు చెందిన 31 మిలియన్ల మంది డేటాను ఇన్‌స్టాగ్రామ్ చాట్‌బోట్స్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టినట్లు రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికే సైబర్ క్రైమ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మారుతోందన్న ఆరోపణలపై ఆ సంస్థ సీఈఓ పావెల్‌ దురోవ్‌ను ఫ్రాన్స్‌లో అరెస్టు చేసిన కొద్ది వారాల్లోనే ఈ తరహా ఘటన జరగడం ఇన్‌స్టాగ్రామ్‌ మీదున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతోందని రాయిటర్స్ అభిప్రాయపడింది.

స్టార్‌ హెల్త్ ఇన్సూరెన్స్ డేటా లీక్ ఘటన ఇలా బయటపడింది:

 స్టార్ హెల్త్‌ ఇన్సూరెన్స్ కస్టమర్ల డేటాను హ్యాకర్‌ లీక్‌ చేసి చాట్‌బాట్స్ సాయంతో టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెట్టగా.. చాట్‌బోట్స్ క్రియేటర్ గుర్తించి ఆ విషయాన్ని సెక్యూరిటీ రీసెర్చర్ దృష్టికి తీసుకేళ్లారు. ఆ సెక్యూరిటీ రీసెర్చర్‌ ఈ అంశాన్ని రాయిటర్స్ దృష్టికి తీసుకెళ్లగా.. రాయిటర్స్ అన్ని విషయాలపై ఆరా తీసిన అనంతరం ఈ కథనం ప్రచురించినట్లు తెలిపింది. స్టార్ హెల్త్ మాత్రం ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రాయిటర్స్‌కు తెలిపింది. సెన్సిటివ్ ఇన్‌ఫర్‌మేషన్  ఏదీ లీక్ కాలేదని.. అంతా సవ్యంగానే ఉన్నట్లు దేశంలో 4వందల  కోట్ల డాలర్ల ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తున్న స్టార్‌ హెల్త్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే తమకు సెక్యూరిటీ రీసెర్చర్‌ నుంచి సమాచారం అందిన వెంటనే తాము చాట్‌బాట్స్ సాయంతో దాదాపు 1500 మంది డేటాను డౌన్‌ లోడ్‌ చేశామని.. అందులో వారి పేరు, చిరునామా, వారి హెల్త్ ప్రొఫైల్‌, ఐడీ కార్డ్స్, ట్యాక్స్ డిటైల్స్‌, టెస్ట్‌ల రిపోర్టులు వంటి సెన్సిటివ్‌ ఇన్ఫర్‌మేషన్ ఉన్నట్లు రాయిటర్స్ వివరించింది.

క్సెన్‌జెన్ పేరిట చాట్‌బాట్స్‌లో స్టార్ హెల్త్ డేటా అమ్మకం:

యూకేకి చెందిన ఒక సెక్యూరిటీ రీసెర్చర్‌ అయిన జేసన్ పార్కర్‌.. హ్యకర్ ఫోరమ్ తరపు నుంచి మాట్లాడుతున్నట్టుగా క్సెన్‌జెన్ సంప్రదింపులు జరిపారు. తమ దగ్గర ఉన్న చాట్‌బాట్స్‌లో స్టార్‌ హెల్త్‌కు చెందిన 7.24 టెరా బైట్స్ డేటా అమ్మకానికి ఉందని.. ఫ్రీగా కావాలంటే కొంత మొత్తాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని క్సెన్ జెన్ చెప్పినట్లు పార్కర్ తెలిపారు. అయితే పార్కర్‌ సమాచారంపైనే ఆధారపడకుండా.. క్సెన్‌జెన్‌ను రాయిటర్స్ మెయిల్ ద్వారా సంప్రదించగా.. తమ దగ్గర ఉన్న డేటాను కొందరికి విక్రయించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాధానంగా వచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది.

రాయిటర్స్ ఆ బోట్స్‌ను టెస్టు చేయడంలో భాగంగా జులైకి చెందిన కస్టమర్ల డేటాను డౌన్‌లోడ్ చేయగా అందులో సెన్సిటివ్ డేటా కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ డేటాను డౌన్‌లోడ్ చేసుకున్న కొంతసేపరటి తర్వాత మరో బాట్స్ సిద్ధం అవుతాయని వెల్‌కమ్ మెసేజ్ వచ్చినట్లు తెలిపింది. ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్‌ను రాయిటర్స్ అప్రమత్తం చేయగా.. వాళ్లు ఆ చాట్‌బాట్స్‌ను డిలీట్ చేసినట్లు తెలిపింది. స్టార్ హెల్త్‌ కూడా తమకు ఆగస్టు 13న తమకు తమ డేటా కాంప్రమైజ్ అయినట్లు సమాచారం అందగా అదే రోజున తమిళనాడులో అధికారులతో పాటు CERT అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపింది. ఆగస్టు 14న ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సేంజ్‌ ఫైలింగ్స్ సమయంలో స్టార్ హెల్త్‌ తెలిపింది.  

            స్టార్‌ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 2006 నుంచి దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. దేశ వ్యాప్తంగా 887 కార్యాలయాలు సహా 30 వేలకు పైగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌ 7 లక్షలా 18వేల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. సంస్థ నెట్‌ వర్త్ 6 వేల 339 కోట్ల రూపాయలు. అసలే ఇన్‌స్టాగ్రామ్ అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తోందని తెలిసి.. దానిపై విచారణ సాగుతున్న తరుణంలో స్టార్‌హెల్త్ డేటా లీక్ కావడం ఆ సంస్థకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టనుంది.

  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget