(Source: Poll of Polls)
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Duleep Trophy News Updates in Telugu | దులీప్ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ జరుగుతున్న అనంతపురం స్టేడియం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Duleep Trophy 2024 | అనంతపురం: నగరంలోని స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ గురువారం నుంచి క్రికెట్ స్టేడియం వెలుపల అనుమానంగా తిరుగుతూ ఉండడం గమనించిన ఇంటిలిజెన్స్ పోలీసులు వీరిపై ఓ కన్నేసి ఉంచారు. వీరందరూ కూడా లైవ్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతునట్టు ఇంటిలిజెన్స్ పోలీసులతోపాటు బీసీసీఐ (BCCI) అబ్జర్వర్లు పక్క సమాచారంతో 15మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు అందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చినట్టు సమాచారం. దులీప్ ట్రోఫీ మూడవ రౌండ్ మ్యాచ్ రెండవ రోజు ఏ గ్రౌండ్ లో జరుగుతున్న ఇండియా A vs ఇండియా C మ్యాచ్ ను E & F బ్లాక్ లలో కూర్చొని 15మంది మ్యాచ్ ని చూస్తున్నారు. వీరందరినీ పక్కా సమాచారం తో పోలీసు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బెట్టింగ్ నిర్వహకులా లేక బెట్టింగ్ యాప్స్ ఏజెంట్స్ ఆ..?
ఇండియా A వర్సెస్ ఇండియా C మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా E & F బ్లాక్ లలో అరెస్టు అయిన 15 మంది లైవ్ లో బెట్టింగ్ ఆడుతున్నారా లేక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్స్ కి సంబంధించిన ఏజెంట్స్ ఆ అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. వీళ్ళందరూ లైవ్ లో బాల్ టూ బాల్ బెట్టింగ్ నిర్వహించే ముఠాగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాంగుకు సంబంధించి బెంగళూరులో ఒక ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ లో వివిధ యాప్స్ ద్వారా క్రికెట్ మ్యాచ్ బెట్టింగులు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తూ ఉంటారు. ఆ యాప్స్ కు సంబంధించి లైవ్ అప్డేట్స్ నీ వీరు ప్రత్యక్షంగా అందిస్తున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే గ్రౌండ్ నుంచి ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫాం ఐన టీవీ, వీడియో ఆప్స్ లో జరుగుతున్న మ్యాచ్ లైవ్ రిలే రావాలంటే కనీసం 40 సెకండ్ల వ్యవధి టైం పడుతుంది. అంటే ఒకటి లేదా రెండు బాల్స్ తేడాతో లైవ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో లైవ్ అప్డేట్స్ కోసం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఇలా వారి ఏజెంట్లను మ్యాచ్ జరుగుతున్న ప్రదేశాలకు పంపిస్తూ ఉంటారు. వారు మ్యాచ్ జరుగుతున్న తీరును.. లైవ్ స్కోర్ ను వివిధ అప్డేట్స్ ను బ్యాటింగ్ యప్స్ నిర్వాహకులకు అందజేస్తూ ఉంటారు. ప్రస్తుతం పోలీసులు పట్టుబడ్డ వ్యక్తులు వారే బెట్టింగ్స్ కాస్తున్నారా లేక ఇక్కడి నుంచి వేరే వారికి సమాచారం అందిస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారా లేక ఆన్లైన్ ఆప్స్ కు సంబంధించిన ఏజెంట్స్ ఆ అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.