Ustaad Bhagat Singh: చేతిలో సుత్తి.. వంటిపై యూనిఫామ్ - ప్రమాణ స్వీకారం రోజు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పోస్టర్ రచ్చ
Ustaad Bhagat Singh: బ్రేక్ పడిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఇక క్యాబినెట్ మినిస్టర్‌గా పవన్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్.
Ustaad Bhagat Singh: ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించడం చాలా కష్టమని చాలామంది అంటుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి ప్రయత్నంలోనే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయినా సరే ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల్లో పాల్గొని ఎమ్మెల్యే అయ్యి చూపించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా క్యాబినెట్ మినిస్టర్‌గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తీసుకున్న సందర్భంగా ఆయన అప్‌కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌కు కంగ్రాట్స్ తెలిపారు.
పోలీస్ యూనిఫార్మ్‌లో..
ఏపీ ఎన్నికలు, దాని ప్రచారంలో బిజీ అవ్వడంతో చాలాకాలం పాటు తన అప్‌కమింగ్ చిత్రాల షూటింగ్‌ను పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలమే అయ్యింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారిగా ఈ మూవీ గురించి అప్డేట్ వచ్చింది. అయినా పలు కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. అయినా కూడా పవన్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పోలీస్ యూనిఫార్మ్‌లో ఉన్న హీరో పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
కంగ్రాచులేషన్స్..
‘ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు’ అంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్.. ఆయనకు విషెస్ తెలిపింది. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అనే కొటేషన్‌ను యాడ్ చేసింది. ఇక ఈ పోస్టర్‌లో పోలీస్ యూనిఫార్మ్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీలా నటించింది. ఫైనల్‌గా ఏపీలో ఎన్నికలు, ప్రచారాలు అంతా పూర్తయ్యాయి. కాబట్టి గెలుపు ఇచ్చిన సంతోషంతో మళ్లీ మూవీ షూటింగ్స్‌లో పవన్ పాల్గొంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
View this post on Instagram
మరో రెండు సినిమాలు..
‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ కూడా సగం షూటింగ్‌ను పూర్తిచేసుకొని మళ్లీ పవన్ కళ్యాణ్ సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారా అని ఎదురుచూస్తున్నారు. ఈ రెండూ కాకుండా ‘హరి హర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామాలో కూడా పవన్ నటిస్తున్నారు. ఇది ఈ హీరో కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం. ఎన్నికల వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతుండడంతో దర్శకుడు క్రిష్ సైతం ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
Also Read: పవన్ ప్రమాణ స్వీకారం కోసం పంచెకట్టులో అకిరా - వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్