Renu Desai:పవన్ ప్రమాణ స్వీకారం కోసం పంచెకట్టులో అకిరా - వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్
Renu Desai: పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ఇతర మెగా ఫ్యామిలీతో పాటు అకిరా, ఆధ్య కూడా రెడీ అయ్యారు. ఈ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Renu Desai: గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు రేణు దేశాయ్. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించినప్పటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె మరింత యాక్టివ్ అయ్యారు. ఆమె పోస్టులన్నీ పవన్ కళ్యాణ్ గురించి, తమ కుమారుడు అకిరా నందన్ గురించే ఉంటున్నాయి. పైగా ఇప్పటివరకు పబ్లిక్‌లోకి రావడానికి ఎక్కువగా ఇష్టపడని పవన్ కుమారుడు అకిరా.. ఇప్పుడు యాక్టివ్‌గా అందరి ముందుకు వస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి కూడా అకిరా రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని కూడా రేణు దేశాయ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీడియో కాల్‌లో..
పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం కోసం అంతా సిద్ధమయ్యింది. ఈ వేడుకను నేరుగా చూడడానికి అకిరా నందర్, ఆధ్య రెడీ అయ్యారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తను ఈ ఈవెంట్‌కు రావడం లేదని, పిల్లలు మాత్రమే వెళ్తున్నారని ఈ పోస్ట్‌తో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ‘వాళ్ల నాన్నకు ముఖ్యమైన రోజు కోసం నా పిల్లలు ఇలా రెడీ అయ్యి నాకు వీడియో కాల్ చేశారు’ అంటూ వారు వీడియో కాల్ చేసినప్పుడు తీసుకున్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు రేణు.
పంచకట్టులో అకిరా..
అకిరా, ఆధ్య రెడీ అవ్వడం గురించి చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్‌కు కూడా విషెస్ తెలిపారు రేణు దేశాయ్. ‘ఏపీ రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలి అనుకుంటున్న కళ్యాణ్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని కూడా క్యాప్షన్‌లో రేణు. ఇక ఆమె షేర్ చేసిన వీడియోలో ఆధ్య చుడీదార్‌లో కనిపించగా.. అకిరా మాత్రం పంచకట్టులో ఉన్నాడు. రెడ్ షర్ట్, పంచతో అకిరా చాలా బాగున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అంతే కాకుండా ఈమధ్య అకిరాకు, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పోస్టులు షేర్ చేసినప్పుడు ఫ్యాన్స్ అంతా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారని ఈ పోస్ట్‌కు తన కామెంట్స్‌ను ఆఫ్ చేసుకున్నారు రేణు.
View this post on Instagram
అన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోనే..
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిందని మెగా ఇంట్లో గ్రాండ్‌గా సంబరాలు జరిగాయి. ఆ సంబరాల్లో కూడా అకిరా పాల్గొన్నాడు. మెగా హీరోలతో, మెగా ఫ్యామిలీతో కలిసి ఫోటోలు కూడా దిగాడు. ఈ వీడియోను మాత్రమే రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయలేదు. అది తప్పా దాదాపుగా పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత అన్ని వీడియోలు రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్.. నరేంద్ర మోదీని కలవడానికి వెళ్లినప్పుడు కూడా అకిరా తనతోనే ఉన్నాడు. అంతే కాకుండా తన తండ్రి విషయం సాధించడంతో సంతోషంతో ఒక పవర్‌ఫుల్ వీడియోను కూడా ఎడిట్ చేశాడు అకిరా.
Also Read: ఆ వ్యక్తితో క్లోజ్‌గా సురేఖ వాణి - ముంబై పార్టీలో నటి సందడి , ఫోటో వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

