By: ABP Desam | Updated at : 27 Apr 2023 04:01 PM (IST)
'మళ్ళీ పెళ్లి' సినిమాలోని 'ఉరిమే కాలమా...' పాటలో నరేష్, పవిత్రా లోకేష్
నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie 2023). ఇందులో ఆయనకు జోడీగా, కథానాయికగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను ఈ రోజు విడుదల చేశారు.
లేటు వయసులో ప్రేమలో పడితే...
Urime Kaalama Song : 'ఉరిమే కాలమా...' పాటకు అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు ఎవరిలో ఎలా ప్రేమ కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే... లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని ఈ పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు.
Also Read : రామ్ చరణ్ సినిమా కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు!
It's Destiny that decides True Love ❤️🔥#UrimeKaalama 🎶 Full Lyrical from #MalliPelli OUT NOW 💥
- https://t.co/srSLIBqDHE
🎹 @sureshbobbili9
🎤 @anuragkulkarni_
✍️ @IananthaSriram@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @adityamusic pic.twitter.com/13Vq71b4Yv— MS Raju (@MSRajuOfficial) April 27, 2023
కొన్ని రోజుల క్రితం 'మళ్ళీ పెళ్లి' టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... నిజంగా సినిమా టీజరా? లేదంటే నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన సంఘటనలను రీ క్రియేట్ చేశారా? రియల్ స్టోరీని సినిమాగా తీశారా? అనే సందేహం కలుగుతుంది. అంతలా టీజర్ కట్ చేశారు.
సినిమా కాదు... జీవితంలో జరిగినవే!
Naresh and Pavitra relationship : నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఏంటి? తెలుసుకోవాలని తెలుగు ప్రజలు, కన్నడ ప్రేక్షకులూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకనేది అందరికీ తెలిసిందే. నరేష్, పవిత్ర సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుగు కూస్తోంది. ఆ ప్రచారానికి తోడు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో హై డ్రామా నడిచింది. తమకు మద్దతు ఇవ్వాలని పవిత్రా లోకేష్ ప్రేక్షకులను కోరారు. 'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే... అవన్నీ గుర్తుకు వస్తాయి. మరోసారి ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడతాయి. నరేష్, పవిత్రా లోకేష్ రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూస్తే... రమ్యా రఘుపతి పాత్రలో నటి వనితా విజయ్ కుమార్ యాక్ట్ చేసినట్టు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇది సినిమా కాదు, నరేష్ - పవిత్ర బయోపిక్ అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
Also Read : 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?
'మళ్ళీ పెళ్లి' సినిమాకు మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు. వేసవిలో సినిమా విడుదల కానుంది.
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి.
Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం
Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?
SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు