అన్వేషించండి

Upcoming Telugu Movies: పుష్ప రాజ్ రావడానికి ముందు మీడియం బడ్జెట్ సినిమాల సందడి... థియేటర్లలో ఈ వారం విడుదల అయ్యే మూవీస్ ఇవే!

Theatrical releases this week : డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2 విడుదలకు రెడీ అవుతోంది. దానికి ముందు ఈ వారం థియేటర్లలోకి మూడు మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవేంటంటే..

Upcoming Telugu Movies Theatrical releases : థియేటర్లలోకి నవంబర్ మూడో వారంలో మూడు మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ రూపొందించిన పుష్ప రెండు విడుదలకు రెడీ అవ్వడంతో ముందుగా భారీ సినిమాలేవి రావడం లేదు. మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేయడానికి రెడీ అయ్యాయి అవి ఏమిటో చూడండి. 

‘మెకానిక్ రాకీ‘ అంటున్న విశ్వక్ సేన్!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఫార్ములా కథతో మాసిగా తీసిన చిత్రం ఇది. నవంబర్ 22వ తేదీన థియేటర్లలోకి రానుంది. వరంగల్ వేదికగా నిర్వహించిన సినిమా ఈవెంట్లో పర్సనల్ అటాచ్ చేసిన రివ్యూ రైటర్ల వీపు పగలగొడతా అంటూ విశ్వక్సేన్ చేసిన స్టేట్మెంట్ సినిమాకు బజ్ తీసుకువచ్చింది. మరి ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. 

చిరంజీవి అండతో సత్యదేవ్ ‘జీబ్రా‘!

చిన్న క్యారెక్టర్లు చేయడం నుంచి, స్టార్ హీరోల సినిమాలలో ఫ్రెండ్ రోల్స్ చేయడం దగ్గర నుంచి హీరోగా ఎదిగిన నటుడు సత్యదేవ్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ కూడా చేశాడు. హీరోగా జ్యోతిలక్ష్మి, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా వంటి విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ శుక్రవారం... నవంబర్ 22న జీబ్రా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కన్నడ యంగ్ హీరో డాలి ధనుంజయ మరొక హీరో. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. అక్కడ ఉత్తరాంధ్ర యాసలో ఆయన మాట్లాడిన మాట, సత్యదేవ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read:  మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ శుక్రవారమే మహేష్ మేనల్లుడి సినిమా!

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన తాజా సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అర్జున్ జంధ్యాల డైరెక్షన్ చేశారు. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. తెలుగు తెరకు కథానాయకుడిగా హీరో సినిమాతో వచ్చిన అశోక్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి. 

ఈ మూడు సినిమాలతో పాటు రోటీ కపడా రొమాన్స్ అనే మరో చిన్న సినిమా కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది. జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) అలాగే, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ కామెడీ ‘మందిర’ కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక బాలీవుడ్ బాక్సాఫీస్ విషయానికొస్తే, ‘ఐ వాంట్ టు టాక్’, ‘నామ్ ’ మరి కొన్ని చిన్న సినిమాలు  ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 22న కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తమిళంలో  రిలీజ్ చేస్తున్నారు. 

Also Read:  గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget