Upasana Konidela: క్లిన్‌కారా ఫస్ట్ బర్త్ డే.. అందరూ అడిగేవారు, చాలా టెన్షన్ పడ్డానంటూ చెర్రీ కామెంట్స్ - ఎమోషనల్ వీడియో వదిలిన ఉపాసన
Klin Kaara Konidela Birthday: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన, రామ్ చరణ్‌లకు క్లిన్ కారా పుట్టింది. తను పుట్టి ఒక సంవత్సరం కావడంతో ఒక స్పెషల్ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఉపాసన.
Upasana Konidela: మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకు క్లిన్ కారా పుట్టి ఏడాది అయ్యింది. తన మొదటి బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశారు ఉపాసన. తన డెలివరీ సమయంలో ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అయ్యారు. అమ్మాయి పుట్టిందని తెలిసి ఎంత సంతోషించారు లాంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఏడాది క్రితం ఉపాసన డెలివరీ టైమ్‌లో తీసిన వీడియో ఇది. అప్పుడు కూడా ఈ వీడియోను తానే స్వయంగా షేర్ చేశారు ఉపాసన. ఇప్పుడు క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా క్లిన్ కారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
మంచి పార్ట్‌నర్‌షిప్..
ఉపాసన షేర్ చేసిన ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు తాను కూడా డెలివరీకి కొన్ని క్షణాల ముందు ఎలా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ‘‘పెళ్లయ్యి 11 ఏళ్లు అయ్యింది ఇద్దరూ ఏం చేస్తున్నారు అంటూ చాలామంది అడగడం, చాలా స్ట్రెస్ అవ్వడం.. ఇలా చాలా ఉన్నాయి. ప్రతీది అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరుగుతుందని అర్థమయ్యింది. ఈ పాప పుట్టడానికి కూడా ఇదే సరైన సమయం అనుకుంటా. మేమిద్దరం ఎప్పుడూ ఒకరితో ఒకరం రియల్‌గా ఉన్నాం. ఒకరికంటే మరొకరం ఎప్పుడూ ఎక్కువగా త్యాగం చేయలేదు. తనకు మంచి పార్ట్‌నర్‌షిప్ దొరికింది’’ అంటూ రామ్ చరణ్.. తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.
చాలా ఎమోషనల్..
‘‘నేను చాలా టెన్షన్ పడ్డాను. అంతా సరిగ్గా జరగాలి అనుకున్నాను. బేబి బయటికి వచ్చిన క్షణమే నేను ప్రశాంతంగా ఉండగలను. ఈ 9 నెలలు గడిచిన కాలమంతా నేను చాలా ఎంజాయ్ చేశాను’’ అంటూ బేబి పుట్టక ముందు తన ఆలోచన గురించి తెలిపాడు చరణ్. అప్పుడే వీడియోలో తను బేబిని ఎత్తుకొని ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి రావడం చూపించారు. అది చూసి ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. ‘‘8 నెలలు అలా గడిచిపోయాయి. నేను అస్సలు కదలలేకపోయాను. ప్రతీ విషయానికి చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. అమ్మ అవ్వడం అనేది నాలో మార్పులు తీసుకొస్తుంది అనుకుంటున్నాను’’ అంటూ డెలివరీకి ముందు తన మనసులోని భావాలను కూడా బయటపెట్టారు ఉపాసన.
ఎన్నోసార్లు చూశాను..
‘‘చాలామంది ఈ బేబిని చాలా ప్రేమిస్తారు. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అందరిలోని మంచి ఆలోచనలు, ప్రేమ తనకు అందుతాయి’’ అంటూ ఉపాసన తెలిపారు. అలా డెలివరీ దగ్గర నుండి బేబి పుట్టి, తనకు పేరు పెట్టేంత వరకు మెగా ఫ్యామిలీలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఇందులో చిరంజీవి స్వయంగా క్లిన్ కారా పేరును అనౌన్స్ చేయడం కూడా ఉంది. ‘హ్యాపీ బర్త్ డే నా డార్లింగ్ క్లిన్ కారా. మా జీవితాల్లోకి ఇంత సంతోషం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఈ వీడియోను నేను లక్షలసార్లు చూశాను’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు ఉపాసన కొణిదెల.
View this post on Instagram