Upasana Konidela: ఆ దేశంలో వరుణ్ తేజ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ - పెళ్లి వేదికను లీక్ చేసిన ఉపాసన
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి గురించి ఒక్కొక్కటిగా బయటికొస్తున్న అప్డేట్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక వీరి పెళ్లి ఎక్కడ జరగనుంది అనే విషయాన్ని మెగా కోడలు ఉపాసన లీక్ చేశారు.
టాలీవుడ్లో చాలాకాలం తర్వాత ఒక హీరో, హీరోయిన్‌కు పెళ్లి అవ్వబోతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగా ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. పెళ్లి పనుల గ్లింప్స్‌ను చిరంజీవి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయనతో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను కూడా బయటపెట్టారు. ఇప్పటివరకు వీరి పెళ్లి తేదీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. ఎక్కడ అనే విషయం మాత్రం ఉపాసన రివీల్ చేశారు.
లా ఫెమిలియా..
పార్టీ డెకరేషన్తో పాటు వరుణ్, లావణ్యతో పాటు దిగిన ఫోటోలను షేర్ చేశారు ఉపాసన. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘లా ఫెమిలియా.. టుస్కానీ మేము వచ్చేస్తున్నాం.’ అని పెట్టారు. లా ఫెమిలియా అంటే ఇటలీలో ఫ్యామిలీ అని అర్థం. ఇక ఈ క్యాప్షన్‌ను బట్టి చూస్తే వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలోని టుస్కానీలో జరుగుతుందని తెలుస్తోంది. నవంబర్ 1న వీరి పెళ్లి తేదీ ఖరారు అయినట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమయితే.. ఇప్పటినుండి పెళ్లి పనులు ప్రారంభం అవ్వవు కదా అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
రెండు సాంప్రదాయాలు కలిపి..
వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ జూన్ 9న జరిగింది. అదే రోజు పెళ్లి తేదీని త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఈ జంట తెలిపింది. దీంతో అప్పటినుండి మెగా ఫ్యాన్స్ అంతా తమ మెగా ప్రిన్స్ పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక మెగా ఇంట మొదలయిన పెళ్లి సందడి వీడియోకు లైకుల మీద లైకులు వచ్చేస్తున్నాయి. ఇక ఇటలీలోని ఒక ప్యాలెస్‌లో తెలుగు సాంప్రదాయానికి తగినట్టుగా వరుణ్, లావణ్యల పెళ్లి జరగనున్నట్టు సమాచారం. అంతే కాకుండా లావణ్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమ్మాయి కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెళ్లి సాంప్రదాయాలు కూడా వారు పాటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా వీరి ప్రీ వెడ్డింగ్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు.
రెండు రిసెప్షన్స్..
పెళ్లి ఇటలీలో జరిగినా.. ఇండియాలో మాత్రం రెండు రిసెప్షన్స్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట వరుణ్ తేజ్, లావణ్య. హైదరాబాద్‌లో ఒక రిసెప్షన్ జరగగా.. డెహ్రడూన్‌లో మరొక రిసెప్షన్ ఉంటుందని సమాచారం. ఎంగేజ్మెంట్లాగానే పెళ్లి కూడా చాలా తక్కువమంది సమక్షంలో జరుగుతుందని సమాచారం. ఇక హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసి రెండు కుటుంబాల స్నేహితులను, సినీ పరిశ్రమ వారిని పిలవారని ప్లాన్ చేస్తున్నారట. లావణ్య.. డెహ్రాడూన్‌లో పెరిగింది కాబట్టి అక్కడ కూడా ఒక రిసెప్షన్ ప్లాన్ చేసి.. తన స్నేహితులు, సన్నిహితులను పిలవాలని ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి చాలాకాలం తర్వాత టాలీవుడ్లో జరుగుతున్న హీరో, హీరోయిన్ పెళ్లి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: ‘నాటు నాటు’పై లోకేష్ కనగరాజ్ రియాక్షన్ - ‘లియో’లో సాంగ్స్ అందుకే అంటూ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial