News
News
వీడియోలు ఆటలు
X

Upasana Konidela: అందుకే ఆ దుస్తులు ధరించడం లేదు: ఉపాసన

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలని భావిస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు.ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

FOLLOW US: 
Share:

Upasana Konidela : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఉపాసన.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా’’ అని వెల్లడించారు.

ప్రముఖ వ్యాపార వేత్త, 'అపోలో హాస్పిటల్స్' గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన తమ పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. శోభ కామినేని, అనిల్ కామినేని దంపతుల రెండో కుమార్తె అయిన ఉపాసన.. చిన్న వయసు నుంచే వ్యాపార లావాదేవీలను చూసుకోవడం మొదలుపెట్టారు. ఓ పక్క బిజినెస్ చూసుకుంటూనే, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

పెళ్లైన పదేళ్ల‌కు ఉపాసన గర్భం దాల్చడంతో  మెగా కుటుంబంలో ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘మెటర్నిటీ స్టైల్’ కొనసాగిస్తున్న  ఉపాసన.. ప్రెగ్నెన్సీ అనేది వేడుకగా ఉండాలని భావిస్తున్నానన్నారు. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానన్న ఆమె.. అందుకే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ ప్రెగ్నెన్సీని నాకు నేను రీడిఫైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తునంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను. పోషకాహారం ఎంత తీసుకుంటున్నాననే విషయాలతో పాటు నా గురించి ఆలోచించాలని డాక్టర్ చెప్పారు. దీంతో నార్మల్ దుస్తుల్లోనే ఫిట్‌గా కనిపిస్తున్నాను. అందుకే మెటర్నిటీ దుస్తులు ధరించడం లేదు. ఇలా కనిపించడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నాను. నిజానికి ఇదొక గొప్ప ప్రయాణం’’ అంటూ తన మనసులోని అభిప్రాయాలను ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా శరీరానికి తగినట్లుగా దుస్తులు, జువెలరీని తన మూడ్‌కు అనుగుణంగా ధరిస్తానని వెల్లడించారు.  మేడిన్ కశ్మీర్, స్వీడన్ దుస్తులు ధరించడం తనకు ఇష్టమని ఉపాసన వివరించారు.

మామూలుగా  ప్రెగ్నెన్సీ అనగానే ఫుడ్, బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు బయటికి లేదా ప్రయాణాలు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. దాదాపు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఉపాసన మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించి నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో ఆనందకర సన్నివేశాలను ఆస్వాదిస్తూనే.. మోడరన్ కల్చర్ ను ఎలా ఫాలో కావాలో ఉపాసన చేసి మరీ చూపిస్తున్నారు. దీంతో చాలా మంది ఉమెన్స్ ఉపాసన ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్

రామ్ చరణ్ ఉపాసన ఇటీవలే ఫారిన్ టూర్ ను ముగించుకొని వచ్చారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఉపాసనను ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ. మరోవైపు ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. మరోవైపు మెగా అభిమానులు కూడా వారుసుడి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ ప్రాజెక్టులో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా కియార అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. 

Published at : 17 Apr 2023 04:09 PM (IST) Tags: apollo Ram Charan Upasana Konidela Pregnency Meternery

సంబంధిత కథనాలు

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్,  ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!