News
News
వీడియోలు ఆటలు
X

Unstoppable Release Date : వేసవిలో నాన్ స్టాప్ నవ్వులతో 'అన్‌స్టాపబుల్' రెడీ - సన్నీ, సప్తగిరి సినిమా చూస్తారా?

హీరో వీజే సన్నీ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా 'అన్ స్టాపబుల్' కు సంబంధించిన ఓ అప్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమా జూన్ 9న విడుదల కానుందని వెల్లడిస్తూ.. మూవీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు..

FOLLOW US: 
Share:

Unstoppable : డైరెక్టర్ రత్నబాబు దర్శకత్వంలో 'బిగ్ బాస్' విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అన్ స్టాపబుల్'. ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కానుందంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు. దాంతో పాటు మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ఈ సినిమాలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

'పిల్లా నువ్వు లేని జీవితం', 'ఈడో రకం  ఆడో రకం' వంటి హాస్యా ప్రధాన సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రత్నబాబు రూపొందిస్తున్న 'అన్ స్టాపబుల్' సినిమాను ఎ2బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మిస్తున్నారు. హైదరబాద్, నిజామాబాద్, గోవా వంటి పలు ప్రాంతాల్లో ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇంతకుమునుపే రిలీజైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

థియేటర్ కు కుటుంబంతో సహా వచ్చి హాయిగా నవ్వుకునే సినిమాగా 'అన్ స్టాపబుల్'.. అన్ లిమిటెడ్ ఫన్ అనే క్యాప్షన్ కు తగ్గట్టేలా సినిమాను తెరకెక్కించామని డైరెక్టర్ డైమండ్ రత్నబాబు ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమాతోనే రజిత్ రావు నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. కాగా అన్ స్టాపబుల్ మూవీలో బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు డీజే టిల్లు మురళి, సూపర్ విమర్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మి, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్, చక్రపాణి, "గబ్బర్ సింగ్' బ్యాచ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియే సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

నటనపై ఆసక్తితో వీజే సన్నీ చిన్న వయసులోనే నటనపై దృష్టి సారించాడు. 'అల్లాద్దీన్' అనే నాటకంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత ఓ ఛానెల్ లో ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోకి యాంకర్‌గా.. న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కొంతకాలం పని చేశాడు. అనంతరం బుల్లితెరపై 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో జయసూర్య అనే పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా 'సకలగుణాభిరామ' అనే సినిమాలో వీజే సన్నీ ఛాన్స్ కొట్టేశాడు. అంతకుమునుపు బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్ గా వెళ్లి.. విజేతగా తిరిగొచ్చాడు. టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, షాద్ నగర్ వెంచర్ సువర్ణ భూమిలో రూ.25 లక్షల విలువ చేసే స్థలం గెలుచుకున్నాడు. సినిమాల్లోనే కాకుండా 'ఏటీఎం' అనే వెబ్ సిరీస్ లోనూ సన్నీ నటించి, ఆడియెన్స్ ను అలరించాడు.

Also Read : ఛత్రపతి రివ్యూ : బెల్లంకొండ బాలీవుడ్ రీమేక్ ఎలా ఉంది? న్యాయం చేశారా? చెడగొట్టారా?

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో  సంజీవ రెడ్డి  నిర్మించిన 'సకలగుణాభిరామ' సినిమా గతేడాది సెప్టెంబర్ లో రిలీజైంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయకపోయినా.. ఓ మోస్తారుగా పర్వాలేదనిపించేదిగా ఈ సినిమా ఆడింది. దీంతో మరో కొన్ని రిలీజ్ కానున్న 'అన్ స్టాపబుల్' సినిమాపై వీజే సన్నీ భారీ ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?

Published at : 12 May 2023 04:35 PM (IST) Tags: Unstoppable VJ Sunny nakshatra Diamond Ratna Babu Aksa Khan

సంబంధిత కథనాలు

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్