అన్వేషించండి

Troll Song: ‘UI’ ట్రోల్ సాంగ్: సోషల్ మీడియా జనాలపై ఉపేంద్ర సెటైర్లు - కుమారి ఆంటినీ వదల్లేదుగా!

Upendra UI Movie: క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌ తాజా మూవీ 'యూఐ' నుంచి మరోపాట విడుదల అయ్యింది. ట్రోల్ సాంగ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పాటతో తెలుగు సెలబ్రిటీలపై ఓ రేంజిలో సైటర్లు వేశారు.

Upendra UI Movie Troll Song: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌.. నా రూటే స‌ప‌రేటు.. అన్న‌ట్లుగా ఉంటాడు. అలా డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటాడు. ఇక గ‌త కొంత‌కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. స‌రికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. 'యూఐ (UI)' పేరుతో కొత్త సినిమాలో న‌టించ‌డంతో పాటు.. డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి.. గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు. రీసెంట్ గా విడుదలైన ‘చీప్ సాంగ్’ ఓ రేంజిలో సంచలనం కలిగించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరో పాటను విడుదల చేశారు.

సెలబ్రిటీలపై సటైర్లు, ఆకట్టుకుంటున్న ట్రోల్ సాంగ్  

నిజానికి చిత్ర విచిత్రమైన సినిమాలు చేయడంలో ఉపేంద్ర దిట్ట. అలాంటి సినిమాలతోనే కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా కథలే చాలా వింతగా ఉంటాయి. ఆయన తప్ప మరొకరు ఆ సినిమాలు చేయలేరు అనేలా ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తోనే ఆయన లేటెస్ట్ మూవీ 'యూఐ' రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'యూఐ' నుంచి ట్రోల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఏకంగా తెలుగు సెలబ్రిటీలపై సటైర్లు వేశారు. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియా సొసైటీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అనే విషయాన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారేందుకు ఎలా దిగజారిపోతున్నారు? ఇన్ స్టా రీల్స్, లైక్స్ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు? ఎలాంటి విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి? అనేది ఈ పాటలో చూపించారు. మనుషులు సమాజం, సామాజిక బాధ్యతలను వదిలేసి, టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఎలా గడుపుతున్నారు? అని చెప్పడంతో పాటు రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన విషయాలను గుర్తు చేశారు. రాజకీయ నాయకుల నుంచి బర్రెలక్క దాకా, అర్జున్ రెడ్డి నుంచి కుమారీ ఆంటీ దాకా అందరిపైనా సెటైర్లు విసిరారు. ‘ట్రోలవుతుందే.. నీది ట్రోలవుతుందే’ అంటూ సాగిన ఈ పాట వినడానికి కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  

‘ఉప్పి 2’ తర్వాత 'యూఐ'కి దర్శకత్వం

2015లో ‘ఉప్పి 2’ అనే మూవీని డైరెక్ట్ చేసి నటించారు ఉపేంద్ర. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ మైక్రోఫోన్ పట్టలేదు. ఇక ఇప్పుడు 'యూఐ'ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సిన‌మాని నిర్మిస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.   ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
హేమ మాలిని కాళ్లు మొక్కిన బాలయ్య - మా హీరో బంగారం అంటూ నెటిజన్లు ఫిదా
Telugu TV Movies Today: శ్రీరామ నవమి స్పెషల్... ఇవాళ తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే భక్తి సినిమాలు ఇవే, లిస్ట్ ఇదుగో
శ్రీరామ నవమి స్పెషల్... ఇవాళ తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే భక్తి సినిమాలు ఇవే, లిస్ట్ ఇదుగో
Anna Lezneva : మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
Iran War: అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
Embed widget