Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్? చిరుతో దిగిన ఫోటోలపై అలాంటి కామెంట్
Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం రావడంతో ఆయనకు కంగ్రాట్స్ చెప్పడానికి త్రివిక్రమ్ వెళ్లారు. ఇక వీరిద్దరి ఫోటోపై పూనమ్ కౌర్ కామెంట్ చేసింది.

Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్‌కు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. అయితే, అప్పుడప్పుడు వివాదాలు లేదా సామాజిక కార్యకలాపాలతో ఆమె తన ఉనికి చాటుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులపై సెటైర్లు వేస్తూ.. వారి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి.. పరోక్షంగా కామెంట్లు చేస్తూనే ఉంటోంది. తాజాగా పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పడానికి త్రివిక్రమ్ వెళ్లారు. దానికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానికి కూడా పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యింది.
ప్రతీసారి ఆయననే టార్గెట్..
హీరోయిన్‌గా ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్.. ఇప్పుడు కేవలం కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ చేసిన కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నందుకు మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలపడానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లారు. అలా నిర్మాత చిన్నబాబుతో కలిసి త్రివిక్రమ్ కూడా చిరు ఇంటికి వెళ్లారు. అక్కడ వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ గడ్డం లేకుండా కనిపించడంతో మాటల మాంత్రికుడి న్యూ లుక్ అంటూ పలువురు నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేశారు.
Ace Director #Trivikram garu and Producer S.Radhakrishna(Chinababu) garu Met Megastar ✨ @KChiruTweets garu at his Residence and congratulated him for Bringing Pride to Telugu People yet again with #PadmaVibhushan 💐#PadmaVibhushanChiranjeevi ❤️🔥🧎 pic.twitter.com/dF97kvi24F
— Ujjwal Reddy (@HumanTsunaME) January 27, 2024
బాధగా ఉంది..
చిరంజీవిని త్రివిక్రమ్ కలిసి ఫోటోలపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యింది. ‘ఇది చూడడం చాలా బాధగా ఉంది’ అంటూ హార్ట్ బ్రేక్ సింబుల్‌ను పెట్టి ట్వీట్ చేసింది పూనమ్. దీంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ మరోసారి ఈ హీరోయిన్‌పై సీరియస్ అవుతున్నారు. కావాలనే త్రివిక్రమ్ ఏం చేసినా కూడా పూనమ్ ఏదో ఒక కామెంట్ చేస్తుందని విమర్శిస్తున్నారు. ఇక ఈ దర్శకుడి సినిమాల విషయానికొస్తే.. తాజాగా ‘గుంటూరు కారం’ అంటూ మహేశ్ బాబుతో తెరకెక్కించిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ త్రివిక్రమ్ ముందు సినిమాల తరహాలోనే ‘గుంటూరు కారం’ కూడా ఉందని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని చాలామంది ఆడియన్స్ విమర్శించారు. అందుకే మూవీకి కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘గుంటూరు కారం’ రికార్డులు క్రియేట్ చేసింది.
నెక్స్‌ట్ ఏంటి.?
రాజమౌళితో సినిమాకు చాలా సమయం పడుతుందని గ్రహించిన మహేశ్ బాబు.. గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో ‘గుంటూరు కారం’ను ఫినిష్ చేశాడు. ఇప్పుడు రాజమౌళితో మూవీపై ఫోకస్ పెట్టాడు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. త్రివిక్రమ్ సినిమా చేస్తానంటే స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు చాలామంది సిద్ధంగా ఉంటారు. కానీ ప్రస్తుతం ప్రతీ హీరో చేతిలో కనీసం ఒకటి లేదా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి తన తరువాతి సినిమా కోసం త్రివిక్రమ్.. ఏ హీరోను సెలక్ట్ చేసుకుంటాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
Also Read: రూటు మార్చిన మహేశ్, రాజమౌళి సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంతంటే?
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
ట్రెండింగ్ వార్తలు





















