Mahesh Babu: రూటు మార్చిన మహేశ్, రాజమౌళి సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంతంటే?
Mahesh Babu Remuneration: ఇప్పటికే రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో హీరో రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
Mahesh Remuneration For Rajamouli Movie: ప్రస్తుతం తెలుగులో చాలావరకు స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతీ సినిమాకు ప్రతీ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే పూర్తి వివరాలు బయటికి రాకపోయినా.. వారికి ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్‌ను బట్టి రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇండస్ట్రీ నిపుణులే అంచనా వేస్తుంటారు. అలా దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి చేసే సినిమా కోసం మహేశ్ బాబు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి మహేశ్ రెమ్యునరేషన్.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తన 29వ చిత్రం కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాడు ఈ సూపర్ స్టార్.
లాభాల్లో వాటాలు..
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తున్నాయి. అందుకే తమ సినిమా హిట్ అవుతుందని అమితంగా నమ్మకంతో ఉన్నవారు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. హీరోలతో పాటు దర్శకులు కూడా ఇదే రూట్‌ను ఎంచుకుంటున్నారు. ఇక మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ విషయంలో కూడా ఇదే జరగనుందట. దీనికోసం మహేశ్, రాజమౌళి.. ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోరని, లాభాల్లో వాటాలు మాత్రమే తీసుకుంటారని టాలీవుడ్‌లో ఒక న్యూస్ వైరల్ అయ్యింది.
ఒక్కొక్క సినిమాకు అంత రెమ్యునరేషన్..
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక్కొక్క సినిమాకు రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక మొదటిసారి రాజమౌళి సినిమా కోసం రెమ్యునరేషన్ లేకుండా లాభాల్లో వాటా తీసుకునే డీల్ మాట్లాడుకోనున్నట్టు తెలుస్తోంది. తన బాటలోనే రాజమౌళి కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు కాబట్టి దర్శక ధీరుడు రాజమౌళి తరువాతి చిత్రం ఎలా ఉండబోతుందో అని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
‘ఇండియానా జోన్స్’ తరహాలో..
హాలీవుడ్‌లో ‘ఇండియానా జోన్స్’ అనేది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్. కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ ఫ్రాంచైజ్‌లో ఉన్న ప్రతీ మూవీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. ఇక మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ కూడా ఇదే తరహాలో ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పని పూర్తయ్యిందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నయి. ఈ మూవీలో ఫిట్‌గా అడ్వెంచర్లు చేసే వ్యక్తిగా కనిపించడం కోసం మహేశ్ కసరత్తులు మొదలుపెట్టాడు. ప్రస్తుతం జర్మనీ ట్రిప్‌లో బిజీగా ఉన్నాడు మహేశ్. అయితే ఈ హీరో జర్మనీ వెళ్లింది కూడా రాజమౌళి సినిమా కోసమే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: మహేష్ ఫ్యాన్స్ కి థమన్ ప్రామిస్ - 'గుంటూరు కారం' నుంచి మరో ట్రాక్, అభిమానుల కోసమే!