Trisha Krishnan: చెప్పిందే చేసిన హీరోయిన్ త్రిష - రాజకీయ నేతపై పరువు నష్టం దావా
Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష చెప్పినట్టే చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుపై ఆమె చట్టపరమైన చర్యలకు దిగింది.
Trisha Takes Legal Action On Political: స్టార్ హీరోయిన్ త్రిష చెప్పినట్టే చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుపై ఆమె చట్టపరమైన చర్యలకు దిగింది. తన లీగల్ టీం తాజాగా ఏవీ రాజుకు లాయర్ నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. కాగా ఏవీ రాజు ఇటీవల ఓ పొలిటికల్ మీటింగ్‌లో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్టుకు తీసుకువచ్చారంటూ అతడు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అతడి కామెంట్స్‌ను కోలీవుడ్ సినీతారలు ఖండించారు. అంతేకాదు వారంతా ముకుమ్ముడిగా ఏవీ రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఫేం కోసం, డబ్బుల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఇలాంటి మానుకోవాలంటూ అతడికి కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున్న త్రిషకు మద్దుతు తెలుపుతూ ఏవీ రాజు కామెంట్స్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఏవీ రాజుపై ఇప్పటికే స్పందించిన త్రిష అతడిపై తీవ్ర అసహనం చూపించింది. ఆమె ట్వీట్ చేస్తూ ఫేమస్ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలంటూ ఏవీ రాజుపై సీరియస్ అయ్యింది. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తుందని, దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. అంతేకాదు తన లీగల్ తదుపరి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.
— Trish (@trishtrashers) February 22, 2024
చెప్పినట్టుగా తాజాగా త్రిష లీగల్ టీం ఏవీ రాజుపై చట్టపరమైన చర్యలకు దిగింది. ఏవీ రాజుపై పరువునష్టం దావా కేసు ఫైల్ చేసి అతడికి నోటీసులు ఇచ్చింది. తాజాగా వాటినే త్రిష తన ట్విటర్‌లో షేర్ చేసింది. కాగా ఈ మధ్య త్రిషకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దళపతి విజయ్ లియో మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిన్న రోల్ చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ మూవీ రిలీజ్ తర్వాత ఓ ఇంటర్య్వూలో త్రిష తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మూవీ హీరోయిన్ త్రిషతో రేప్ సీన్ పెట్టుంటే బాగుండంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అప్పట్లో అతడి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.
Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మహేష్ బాబుకు జక్కన్న కండీషన్స్, ఇక కష్టమే!
అప్పుడు కూడా ఇండస్ట్రీ ఆమె అండగా నిలబడింది. అంతేకాదు మన్సూర్‌పై త్రిష లీగల్ యాక్షన్ తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అతడు క్షమాపణలు చేప్పడంతో ఈ వివాదం కాస్తా సద్దుమనిగింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఏవీ రాజు కామెంట్స్ సినీ, రాజకీయ రంగాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే త్రిషపై ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలను మన్సూర్ అలీ ఖాన్ సైతం ఖండించడం విశేషం. తన సహా నటులపూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధగా కలిగించిందని, ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయన్నాడు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ రాజకీయ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేశాడు.